గడ్డకట్టే చలిలో జనం పరుగులు.. ఎందుకో తెలుసా ?? వీడియో
గడ్డ కట్టే చలిలో జనాలు పరుగులు తీస్తున్నారు. కనురెప్పలు సహా ముఖమంతా మంచు కప్పేసినా.. నోటిలోని లాలాజలం సైతం గడ్డకట్టిపోతున్నా.. లెక్క చేయకుండా లక్ష్యంవైపు దూసుకుపోతున్నారు.
గడ్డ కట్టే చలిలో జనాలు పరుగులు తీస్తున్నారు. కనురెప్పలు సహా ముఖమంతా మంచు కప్పేసినా.. నోటిలోని లాలాజలం సైతం గడ్డకట్టిపోతున్నా.. లెక్క చేయకుండా లక్ష్యంవైపు దూసుకుపోతున్నారు. అవును.. అదొక పరుగు పందెం.. అలాంటి ఇలాంటి పరుగు పందె కాదు.. రష్యాలోని సైబీరియాలో ఉన్న ఓమ్యకోన్‌లో ఇటీవల జరిగిన మంచు మారథాన్. ఈ మారథాన్‌లో 42.19 కిలో మీటర్లు ఆగకుండా పరుగెత్తి గమ్యం చేరుకోవాలి. ఆ ఏముందిలే.. ఒళ్లంతా వెచ్చని దుస్తులు కప్పుకొని పరిగెత్తడమూ ఓ విశేషమేనా అని అనుకుంటున్నారా? విశేషమే మరి.ఈ పోటీ జరిగిన సమయంలో అక్కడ ఉష్ణోగ్రత ఎంతో తెలుసా? మైనస్ 53 డిగ్రీల సెల్సియస్. ఇంత చల్లటి ఉష్ణోగ్రతల్లో జరిగిన పోటీ కాబట్టే ‘వరల్డ్స్ కోల్డెస్ట్ మారథాన్’గా గిన్నిస్ రికార్డులకెక్కింది. ఈ పోటీలో అమెరికా, రష్యా, యూఈఏ, బెలారస్‌కు చెందిన 65 మంది పరుగువీరులు అత్యంత ప్రతికూల వాతావరణాన్ని సైతం లెక్కచేయకుండా పాల్గొన్నారు.
Also Watch:
మీరు చేసే ఈ తప్పులే తలనొప్పికి కారణం.. అవేంటో తెలుసా ?? వీడియో
ఛీ..ఛీ.. ఇదేం ఫుడ్‌రా బాబు !! తేలు, పాముల సూప్.. వీడియో
అందంగా ముస్తాబైన పెళ్లి కూతురు.. కానీ వరుడు చేసిన పనేంటో తెలుసా ?? వీడియో
Viral Video: మహిళపై షార్క్ ఎటాక్ !! పోరాడి.. పోరాడి.. !! వీడియో
టామ్ అండ్ జెర్రీలో పుష్ప సన్నివేశాలు. వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు.. వీడియో
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

