Viral Video: విశ్వాసం అంటే ఇదే.. యజమాని పిల్లలని కాపాడేందుకు నాగుపాముతో పోరాడి చంపిన శునకం.. వీడియో వైరల్

|

Sep 25, 2024 | 3:51 PM

కుక్క కింగ్ కోబ్రా వంటి విషపూరిత పాముతో పోరాడి తన యజమాని పిల్లల ప్రాణాలను కాపాడింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతోంది. కింగ్ కోబ్రా చాలా ప్రమాదకరమైన, విషపూరితమైన పాము. అయితే తన యజమాని పిల్లలను రక్షించడానికి పిట్‌బుల్ ఎలాంటి భయం లేకుండా పామును ఎదుర్కొన్న విధానాన్ని చూసి ప్రజలు షాక్ తిన్నారు. అంతేకాదు పిట్‌బుల్ విశ్వాసం, దాని రక్షణ స్వభావం గురించి మరోసారి నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు.

Viral Video: విశ్వాసం అంటే ఇదే.. యజమాని పిల్లలని కాపాడేందుకు నాగుపాముతో పోరాడి చంపిన శునకం.. వీడియో వైరల్
Pitbull Kills Cobra
Image Credit source: X/@vishal_rajput01
Follow us on

విశ్వాసానికి శునకం పెట్టింది పేరు. యజమాని కోసం తన ప్రాణాలను సైతం ఫణంగా పెడుతుంది. అందుకే ఎక్కువ మంచి కుక్కలను తమ ఇంటిలో సభ్యుల్లా భావించి పెంచుకుంటారు. అలాంటి కుక్కలు అనేక రకాలున్నాయి. అయితే పిట్‌బుల్‌ను ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన కుక్క అని కూడా పిలుస్తారు. ఈ కుక్క కింగ్ కోబ్రా వంటి విషపూరిత పాముతో పోరాడి తన యజమాని పిల్లల ప్రాణాలను కాపాడింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతోంది. కింగ్ కోబ్రా చాలా ప్రమాదకరమైన, విషపూరితమైన పాము. అయితే తన యజమాని పిల్లలను రక్షించడానికి పిట్‌బుల్ ఎలాంటి భయం లేకుండా పామును ఎదుర్కొన్న విధానాన్ని చూసి ప్రజలు షాక్ తిన్నారు. అంతేకాదు పిట్‌బుల్ విశ్వాసం, దాని రక్షణ స్వభావం గురించి మరోసారి నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. ముఖ్యంగా తమ కుటుంబాన్ని కాపాడే విషయంలో జంతువులకు ఉన్న ధైర్యం.. తన యజమాని కుటుంబం పట్ల ఉన్న వాటి ప్రేమ ఇలాంటి లక్షణాలను ఈ వీడియో తెలియజేస్తుంది.

వైరల్ అవుతున్న ఈ వీడియో ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీకి చెందినది. ఇక్కడ శ్రీ గణేష్ కాలనీలోని ఒక ఇంటి తోటలో నల్ల తాచు పాము, పిట్‌బుల్ మధ్య ప్రమాదకరమైన పోరాటం జరుగుతోంది. కొంతమంది పిల్లలు తోటలో ఆడుకుంటుండగా తమ వైపు వస్తున్న నాగు పాము చూసి భయపడిపోయారు. అయితే పెంపుడు జంతువు పిట్‌బుల్ పామును గమనించిన వెంటనే.. ఆ పాము నుంచి పిల్లల ప్రాణాలను రక్షించడానికి ప్రమాదకరమైన కింగ్ కోబ్రాపై దూసుకుపోయింది. దీని తర్వాత ఏం జరిగిందో చూసి ఇంటర్నెట్ జనాలు ఆ శునకాన్ని రియల్ హీరో అంటూ పొగిడేస్తున్నారు. పిట్‌బుల్ కోబ్రా పనిని కేవలం 18 సెకన్లలో పూర్తి చేసింది. కుక్క పామును తన నోటితో గట్టిగా పట్టుకుని కొరికి నేలపై వేసి కొడుతూ చంపినట్లు వీడియోలో మీరు చూస్తారు.

ఇవి కూడా చదవండి

పిట్‌బుల్ నాగుపాముతో పోరాడి పిల్లల ప్రాణాలను కాపాడిన వీడియోను ఇక్కడ చూడండి.

అయితే వాస్తవానికి ఢిల్లీ హైకోర్టు ఆదేశాల ప్రకారం పిట్‌బుల్ కుక్కలను పెంపుడు జంతువులుగా పెంచుకోవడానికి ప్రభుత్వం అనుమతి లేదు. @vishal_rajput01 హ్యాండిల్‌తో సోషల్ సైట్‌లో ఈ వీడియోను షేర్ చేస్తూ పిట్‌బుల్ పామును నోటితో నొక్కి, నేలపై కొట్టి దాని ప్రాణం తీసిందని వినియోగదారు రాశారు. ఈ 18 సెకన్ల క్లిప్ సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతోంది. ప్రజలు పిట్‌బుల్‌ను ప్రశంసిస్తున్నారు.

 

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..