
Pigeon Dance: సోషల్ మీడియాలో జంతువులు, పక్షులు వీడియోలు తెగ సందడి చేస్తున్నాయి. నెటిజన్లు కూడా వీటిని చూడడానికి బాగా ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో ఇవి షేర్ చేసిన క్షణాల్లోనే వైరల్‌గామారిపోతున్నాయి.ఈ వీడియోల్లో కొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తే.. మరికొన్ని ముచ్చటేస్తుంటాయి. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. నెటిజన్ల మనసును దోచుకుంటోంది. సాధారణంగా పక్షులు గాలిలో ఎగురుతూ ఆకాశంలో విన్యాసాలు చేయడం మనం చూసే ఉంటాం. అయితే నేలపై మనుషుల్లాగా డ్యాన్స్ చేయడం మీరెప్పుడైనా చూశారా? అయితే ఈ వీడియో చూడండి.. ఇందులో పావురం ఓ ప్రొఫెషనల్ డ్యాన్సర్‌లా స్టెప్పులేసింది.
నెట్టింట్లో వైరల్ అవుతున్న వీడియోలో ఒక పాట బీట్‌పై పావురం డ్యాన్స్ చేస్తూ ముందుకు సాగడం మనం చూడవచ్చు. అలా చాలా సేపు కాలు కదుపుతూనే ఉండడం చూస్తుంటే పావురుం ఓ ప్రొఫెషనల్ డ్యాన్సర్ దగ్గర ట్రైనింగ్ తీసుకుందేమో అని అనిపించక మానదు. Buitengebieden అనే ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసిన ఈ వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది. ఇప్పటివరకు 17 లక్షల మందికి పైగా ఈవీడియోను వీక్షించారు. లైకుల వర్షం కురిపిస్తూ ఒకరి షేర్ చేసుకుంటున్నారు. అలాగే పావురం ఈ విధంగా డ్యాన్స్ చేయడం మొదటిసారి చూశాంటూ తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు.
Sound on.. ? pic.twitter.com/omeHQ8yZR7
— Buitengebieden (@buitengebieden) August 27, 2022
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..