RRR Pre Release Event: టాలీవుడ్(Tollywood) మోస్ట్ అవెయిటెడ్ మూవీ ఆర్‌ఆర్‌ఆర్.. మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కు రెడీ అవుతుంది. ఆర్ఆర్ఆర్ సినిమా కోసం సినీ అభిమానులతో పాటు సెలబ్రెటీలు సైతం ఎదురచూస్తోంది. కరోనా కారణంగా పలుమార్లు రిలీజ్ వాయిదాపడ్డ ఈ ప్యాన్ ఇండియా మూవీ ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైంది. దీంతో రామ్ చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి సహా చిత్ర యూనిట్ సినిమా ప్రమోషన్స్ వేగం పెంచారు మూవీ మేకర్స్. ఈ క్రమంలో మార్చి 19న కర్ణాటకలో ఆర్‌ఆర్‌ఆర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కర్నాటక ముఖ్యమంత్రి సైతం హాజరై రాజమౌళి టీంకి శుభాకాంక్షలు తెలిపారు. సినిమా అఖండ విజయం సాధించాలని ఆకాంక్షించారు.
. @PawanKalyan – @AlwaysRamCharan ❣️❤️
Ma party Jenda Ma Taravata Etey Dammu #RC &AA Fansey Ki Undii ? pic.twitter.com/y9CxkAMSW6
— EastGodavari PawanKalyan FC™ (@PKFC_EGodavari) March 19, 2022
ఇదిలా ఉంటే ఆర్ఆర్ఆర్ ప్రీరిలీజ్ ఈవెంట్ కార్యక్రమంలో జెండాలు కలకలం సృష్టించాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కర్ణాటక, ఏపీ సరిహద్దులోని చిక్కబళ్లాపూర్ లో ఈ ఈవెంట్ జరిగిన విషయం తెలిసిందే. ఇందులో పలువురు హీరోల అభిమానులు రచ్చ రచ్చ చేశారు. అక్కడ ఏర్పాటు చేసిన టవర్ పైకి ఎక్కిన పవన్ కల్యాణ్ అభిమానులు జనసేన జెండాలు ఎగరేశారు. అలాగే, పవన్ కల్యాణ్ ఫొటో ఉన్న జెండాలను కూడా ఎగరేశారు. వాటిని కొందరు తొలగించారు. మరో హీరో జెండాలు ఎగరేశారు. దీంతో కాసేపు అక్కడ ఉద్రిక్తత నెలకొంది. టవర్ పై నుంచి కిందకు దిగాలని నిర్వాహకులు సూచించినప్పటికీ అభిమానులు వినిపించుకోలేదు.
Na life lo first and biggest event #RRRMovie #RRRPreReleaseEvent baricads ni tokkukuntu vellipoyaru?? ? vip,silver, golden anni bokke ?????? pic.twitter.com/EIJuLpgoS6
— SUBBU (@Subramani11nani) March 20, 2022
Also Read:
Nalgonda Temperature: నల్గొండలో నిప్పుల కుంపటి.. దేశంలోనే టాప్ ప్లేస్.. పూర్తి వివరాలివే