Viral Video: అందుకే ఓల్డ్‌ ఈజ్‌ గోల్డ్‌ అనేది.. 95 ఏళ్ల క్రితం కార్లను ఎలా పార్క్‌ చేసేవారో తెలుసా?

|

Aug 30, 2022 | 6:17 PM

ఆ పక్కనే మరో కారు పార్క్ చేసినా.. పార్కింగ్ స్థలం నుంచి వాహనాలను తొలగించడంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేలా కారు ముందు చక్రాలు తిరిగినట్లు ఈ వీడియోలో చూడవచ్చు.

Viral Video: అందుకే ఓల్డ్‌ ఈజ్‌ గోల్డ్‌ అనేది.. 95 ఏళ్ల క్రితం కార్లను ఎలా పార్క్‌ చేసేవారో తెలుసా?
Car Parking
Follow us on

నేటి ప్రపంచమంతా సాంకేతికతపై ఆధారపడి ఉంది . ప్రతి పనికీ టెక్నాలజీని వినియోగిస్తున్నారు. ఈ సాంకేతికత కారణంగానే నేడు మనుషులు చంద్రునిపైకి చేరుకుంటున్నారు. విశ్వం రహస్యాలను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే గతంలో ఇంత సాంకేతిక పరిజ్ఞానం ఉండేది కాది. అయితే ఓల్డ్ ఈజ్‌ గోల్డ్‌ అన్నట్లు కొన్ని అంశాలకు సంబంధించి అప్పటి విధానాలు అద్భుతమైనవి. అలాంటి టెక్నిక్‌కి సంబంధించిన వీడియో ఈ రోజుల్లో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది . ఇది చూసిన తర్వాత అందరూ ‘వావ్’ అన్న మాట తప్పకుండా వస్తుంది. నేటి కాలంలో ప్రపంచంలో వాహనాల సంఖ్య పెరిగిపోయింది. ఇవి ప్రజల జీవితాన్ని సులభతరం చేసినా చాలా సమస్యలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా వాహనాల నుంచి వెలువడే పొగ వల్ల కాలుష్యం పెరిగిపోతోంది. అలాగే రోడ్లపైకి వాహనాలు అధికంగా రావడంతో ఎక్కడికక్కడ పార్కింగ్‌కు సైతం ఇబ్బందులు పడాల్సి వస్తోంది. అయితే 95 ఏళ్ల క్రితమే ఇలాంటి అద్భుతమైన టెక్నాలజీని కనిపెట్టారు. కార్లను పార్కింగ్ చేయడానికి, అలాగే పార్కింగ్‌ ప్లేస్‌ నుంచి బయటకు తీసుకురావడానికి ఎలాంటి ఇబ్బంది లేని టెక్నిక్‌ను కనిపెట్టారు.

ఆ పక్కనే మరో కారు పార్క్ చేసినా.. పార్కింగ్ స్థలం నుంచి వాహనాలను తొలగించడంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేలా కారు ముందు చక్రాలు తిరిగినట్లు ఈ వీడియోలో చూడవచ్చు. ఈ టెక్నిక్ అద్భుతంగా ఉంది. ఇది ప్రస్తుతం ఎక్కడా కనిపించనప్పటికీ, నేటి కాలంలో ఈ సాంకేతికత చాలా అవసరమని ఈ వీడియోను చూసిన నెటిజన్లు భావిస్తున్నారు. హిస్టారిక్ విడ్స్ పేరుతో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో ఈ వీడియో షేర్‌ చేశారు. కేవలం 38 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోను ఇప్పటివరకు మిలియన్ల మంది వీక్షించారు. అలాగే లక్షలాది లైకులు, కామెంట్లు వస్తున్నాయి. ‘అందుకే ఓల్డ్‌ ఈజ్‌ గోల్డ్‌ అనేది’, ‘ఈటెక్నిక్‌ అద్భుతంగా ఉంది’, ‘నేటి కాలంలో కచ్చితంగా ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకోవాల్సిందే’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..