Viral: లైకుల కోసం ఏంటీ పిచ్చి చేష్టలు.. మరీ ఇలా తయారయ్యారేంటి.?
ఇంటర్నెట్ వాడకం ఎక్కువైపోవడంతో.. ఈ మధ్యకాలంలో యువత లైకుల కోసం, ఫాలోవర్స్ పెంచుకోవడానికి పిచ్చి చేష్టలు చేస్తున్నారు. వాళ్లు చేసే పనులు..

ఇంటర్నెట్ వాడకం ఎక్కువైపోవడంతో.. ఈ మధ్యకాలంలో యువత లైకుల కోసం, ఫాలోవర్స్ పెంచుకోవడానికి పిచ్చి చేష్టలు చేస్తున్నారు. వాళ్లు చేసే పనులు ఇతరులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. తాజాగా ఓ వైరల్ వీడియో ఇంటర్నెట్‌లో తెగ చక్కర్లు కొడుతోంది. ఇందులో ఇద్దరు యువకులు ఒంటికి సబ్బు రాసుకుని బైక్‌పై అర్ధనగ్నంగా ప్రయాణిస్తూ స్నానం చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో జరిగింది. దీన్ని చూశాక మీరూ కూడా షాక్ కావడం ఖాయం.
వైరల్ వీడియో ప్రకారం.. నగరంలో వర్షం కురుస్తుండగా.. ఇద్దరు యువకులు సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వడానికి.. ఒంటిపై సబ్బు రాసుకుని.. బైక్‌పై అర్ధనగ్నంగా ప్రయాణిస్తూ స్నానం చేశారు. ఇక వారి స్టంట్ కొంతమంది వాహనదారులు వీడియో తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది.
కాగా, ఈ వీడియోపై కాన్పూర్ ట్రాఫిక్ పోలీసులు స్పందించారు. ఆ ఇద్దరు యువకుల కోసం వెతుకులాట ప్రారంభించారు. అటు దీనిపై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొందరు ఇది ఫన్నీగా ఉందని కామెంట్ చేస్తుంటే.. మరికొందరు ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదని హితబోధ చేస్తున్నారు.
