పానీపూరి నుంచి పావ్ భాజీ వరకు అన్ని రకాల ‘స్ట్రీట్ ఫుడ్’లో టమాటాలను ప్రధానమైనవి. ఏదైనా కూరగాయల వంటకంలో కూడా గ్రేవీ కోసం సన్నగా తరిగిన టమోటాలు చాలా తప్పనిసరి! చిన్న హోటళ్లలో, చేతి బండ్ల నుండి ఆహారాన్ని విక్రయించే వీధి వ్యాపారుల వరకు ప్రతి ఒక్కరూ టమోటాను అవసరమైనంత తరచుగా కోయలేరు. అందుకోసం ఒకేసారి అన్ని సిద్ధం చేసి పెట్టుకుంటారు. ఉల్లిపాయ, టమాటా, క్యాబేజీ వంటి అన్ని కూరగాయలను ముందుగానే సన్నగా తరిగి కంటైనర్‌లో నిల్వ ఉంచుకుంటారు.
కానీ, అలాంటి చోట అంత పెద్ద మొత్తంలో కూరగాయలు ఎలా కోస్తారు.? మనలో చాలా మందికి ఈ సందేహం ఉంటుంది. ఇంట్లో కాస్త వంట పెద్దగా చేయాల్సి వస్తే.. ఉల్లిపాయలు-టమాటాలను కోయడానికి త్వరగా కోసే యంత్రాన్ని, లేదంటే ఫుడ్ ప్రాసెసర్‌ని ఉపయోగిస్తాము. అయితే, ఈ ఫుడ్ కార్ట్ విక్రేతలకు అలాంటి గృహ ఎలక్ట్రానిక్ పరికరాలు పనిచేయవు.. మరి వారేలా అంత పెద్ద మొత్తంలో సన్నని ఉల్లిపాయ టమాటాలను కట్ చేస్తారనే సందేహం మీకు ఉంది కదా..
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో చూసిన తర్వాత కూరగాయలు కట్ చేసేందుకు వీడి వ్యాపారులకు ఎలాంటి పరికరాలు అవసరం లేదని ఖచ్చితంగా చెబుతారు. ఎందుకంటే ఇక్కడ వైరల్ అవుతున్న వీడియోలో, ఒక వ్యక్తి యంత్రాల కంటే వేగంగా ఒక నిమిషంలో 100 కు పైగా టమోటాలు కోయడం అందరినీ అవాక్కయ్యేలా చేస్తుంది… ఎలా చేశాడో చూద్దాం.
@crazy_cook_lover_durga పేరుతో ఒక Instagram ఖాతా ద్వారా ఈ వీడియోను షేర్ చేశారు. వీడియో ప్రారంభంలో ఒక పెద్ద గిన్నెలో సుమారు వందకు పైగా టమోటాలు ఉన్నాయి.. ఇప్పుడు ఒక వ్యక్తి పొడవాటి బ్లేడెడ్ కత్తిని తీసుకొని ఆ గిన్నెలోని అన్ని టమోటాలను రప్పరప్ప కట్‌చేయసాగాడు..అతడు తన చేతిని ఎంత స్పీడ్‌గా తిప్పుతున్నాడో..అంతే వేగంగా టమోటాలు సగానికి పైగా కట్ అవుతున్నాయి. ఇప్పుడు వ్యక్తి పాన్‌ను కొద్దిగా వంచి, మిగిలిన టమోటాలను కూడా మళ్లీ అదే పద్ధతిలో కత్తిరించాడు. ఒక్క నిమిషంలో టమాటాలన్నీ సన్నగా తరిగిపోవడం మనం చూడవచ్చు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..