Viral Video: ఈ జింక ఫర్మార్మెన్స్ కు ఆస్కార్ అవార్డు ఇవ్వాల్సిందే.. వీడియో చూస్తే మీరే అదుర్స్ అంటారు..

|

Jul 27, 2021 | 1:49 PM

Viral Video: అడవిలో జంతువుల జీవన విధానం మనందరికీ తెలిసిందే. అరణ్యంలోని కొన్ని జంతువులు శాఖాహార జీవులు అయితే, మరికొన్ని మాంసాహార జీవులు.

Viral Video: ఈ జింక ఫర్మార్మెన్స్ కు ఆస్కార్ అవార్డు ఇవ్వాల్సిందే.. వీడియో చూస్తే మీరే అదుర్స్ అంటారు..
Untitled 1
Follow us on

Viral Video: అడవిలో జంతువుల జీవన విధానం మనందరికీ తెలిసిందే. అరణ్యంలోని కొన్ని జంతువులు శాఖాహార జీవులు అయితే, మరికొన్ని మాంసాహార జీవులు. క్రూర మృగాలైన సింహం, చిరుత, హైనా వంటి జంతువులు తమ మనుగడ కోసం ఇతర జీవులను వేటాడి చంపి తింటాయి. ఇలాంటి క్రూర జంతువుల నుంచి బతికిబయట పడాలంటే.. బలహీనమైన జంతువులకు కనీసం తెలివితేటలైనా ఉండాలి. వాటికున్న తెలివితేటలే.. వాటిని రక్షిస్తాయి. సాధారణంగా సింహాలు, పులులు, చిరుత పులులు జింకలను, ఇతర జంతువులను వేటాడటం అనేక వీడియోలలో చూసుంటాం. వీటి వేటలో ఎన్నో జంతువులు ఆహారంగా మారిపోయిన పరిస్థితులు కూడా ఉన్నాయి. అయితే, తాజాగా ఓ జింకకు సంబంధించిన ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో జింక తెలివిని చూస్తే ఖచ్చితంగా ఫిదా అయిపోయారు. దాని యాక్టింగ్ ఫర్ఫార్మెన్స్ చూసి ఆస్కార్ అవార్డు కూడా ఇవ్వాలని ఫిక్స్ అయిపోతారు.

ఇంతకీ ఈ వీడియోలో ఏముందంటే.. ఓ జింకను చిరుతపులి వేటాడుతుంది. ఈ సమయంలో ఆ జింక అసాధారణమైన తెలివితేటలను ప్రదర్శించింది. ఉన్నట్లుండి నేలపై పడుకుంది. ఆ చిరుతకు ఏమైందో అర్థం కాక బిత్తర చూపులు చూసింది. ఆ వెంటనే హైనా రావడంతో చిరుత అక్కడి నుంచి వెళ్లిపోయింది. హైనా ఆ జింకను తినేందుకు ప్రయత్నించింది. చిరుత మళ్లీ రావడంతో హైనా దాన్ని తరిమే ప్రయత్నం చేసింది. ఇంతలో అలర్ట్ అయిన జింక.. చాలా చాకచక్యంగా వ్యవహించి దొరికిందే సందు అని అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యింది. జింక చేసిన ప్రయత్నం ఫలించి.. ప్రాణాలతో బయటపడింది. దీనికి సంబంధించిన ఋ వీడియోను ట్విట్టర్ యూజర్.. ఆర్క్ డార్క్సిడెనాచర్స్ షేర్ చేయగా.. అదికాస్తా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్లు జింక తెలివికి హ్యాట్సాఫ్ చెబుతున్నారు. ఈ జింక నటనకు ఆస్కార్ అవార్డు ఇవ్వాల్సిందే అని కామెంట్స్ చేస్తున్నారు. మరెందుకు ఆలస్యం ఈ ఫన్నీ వీడియోను మీరూ చూసేయండి.

Viral Video:

Also read:

Nutrition Food: పోషకాహార లోపంతో ఉన్నవారికి కరోనా తేలికగా వ్యాప్తిస్తుంది.. మరణకారకంగానూ మారుతుంది..పరిశోధనల్లో వెల్లడి!

Viral Video: అమ్మో.. ఇదెక్కడి కోతిరా బాబు.. తన్నేసిందిగా.. పరేడ్ గ్రౌండ్స్‌లో కోతి చేసిన పని..

ఏటీఎం కార్డు పై 16 అంకెల సంఖ్య ఎందుకు ఉంటుంది..? ఈ అంకెల రహస్యం ఏంటో తెలుసుకోండి..