సాధారణంగా మొసళ్లు చూసేందుకు దడ పుట్టేంచేలా ఉంటాయి. భీకర శరీరంతో నోరు తెరుచుకుని అటూ.. ఇటూ కదులుతుంటాయి. అయితే తాజాగా ఓ మొసలి వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో ట్రెండ్ అవుతోంది. ఇందులో మొసలి.. చిరుతలా గెంతుతుండటం చూసి నెటిజన్లు షాక్‌కు గురవుతున్నారు.
అమెరికాలోని ఓ జూలో మొసలి.. మనిషి వెనుక చిరుతలా గెంతుకుంటూ వెళ్తోంది. ఈ వీడియోను ఐఎఫ్ఎస్ ఆఫీసర్ సుశాంత నందా ట్విట్టర్‌లో షేర్ చేశాడు. ‘మొసలి ఇలా పరిగెత్తడం మీరెప్పుడైనా చూశారా’ అంటూ ఆయన తన పోస్ట్‌లో పేర్కొన్నారు. ఇప్పటిదాకా ఈ వీడియోకు 79 వేలకు పైగా వ్యూస్ రాగా.. 2.7 వేల మంది లైకులు వచ్చాయి. దీనిని చూసిన నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. లేట్ ఎందుకు మీరూ వీడియోపై ఓ లుక్కేయండి.
I had never seen a crocodile galloping?? pic.twitter.com/PjdnaDVrss
— Susanta Nanda IFS (@susantananda3) August 23, 2022
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..