
Crane – Snake Shocking Video: సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో ఎక్కువగా జంతువులకు సంబంధించినవే ఉంటాయి. వైరల్ అయ్యే వీడియోల్లో కొన్ని ఫన్నీగా.. మరికొన్ని ఆశ్చర్యకరంగా ఉంటాయి. సాధారణంగా.. అటవీ ప్రపంచంలో జీవించేందుకు.. చిన్న జీవులను పెద్ద జీవులు.. వాటిని క్రూర మృగాలు వేటాడుతుంటాయి. వేటాడకపోతే.. అవి ఆకలితో చనిపోతాయి. అందుకే.. చీమల నుంచి సింహం వరకు అన్ని వేటనే నమ్ముకుంటాయి. అయితే పామును పక్షిని వేటాడడం ఎప్పుడైనా చూశారా?.. పక్షులు ఆకాశంలో నుంచే తమ ఎరను నిర్ణయించుకొని.. వాటిపై దాడులు చేస్తాయి. అయితే.. పాము.. పక్షి వేటలో ఎవరిది పై చేయి అవుతుందో కచ్చితంగా చెప్పలేం. తాజాగా.. అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక పక్షి పామును తన ఆహారంగా మార్చుకుంది. దీనిని చూసి నెటిజన్లు తెగ ఆశ్చర్యపోతున్నారు.
సాధారణంగా పక్షులు తమ కడుపు నింపుకోవడానికి, వేటాడేందుకు నీటి జీవులు, చేపలను లక్ష్యంగా చేసుకుంటాయి. అయితే.. వైరల్ వీడియోలో ఓ కొంగ తన నోటితో పామును వేటాడటాన్ని దీనిలో చూడవచ్చు. ఈ సమయంలో పక్షి నుంచి తప్పించుకునేందుకు పాము ప్రయత్నాలు చేస్తుంటుంది. శాయశక్తులా ప్రయత్నించినప్పటినీ.. పాము ఆట సాగదు. దీంతో కొంగ తన నోటితో పామును గట్టిగా పట్టుకోని ఆరగించేందుకు మరోవైపుకు వెళుతుంది.
వైరల్ వీడియో..
ఈ వీడియోను Instagramలో rasal_viper పేజీ షేర్ చేసింది. ఈ వీడియోను ఇప్పటివరకు వేలాది మంది వీక్షించి.. లైక్‌లు చేస్తున్నారు. దీంతోపాటు ఈ వీడియో ఆశ్చర్యంగా ఉందంటూ రకరకాల కామెంట్లు చేస్తున్నారు.
Also Read: