Duck Viral Video: పార్క్‌లో పసిపిల్లలను మరిపించిన బాతు.. దాని ఆట చూస్తే అదుర్స్ అనాల్సిందే..

Duck Viral Video: సోషల్ మీడియా పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చాక ప్రపంచమే ఒక కుగ్రామంలా మారిపోయింది. ఖండాంతరాలలో ఏ మూలన ఏం జరిగినా జనాలకు ఇట్టే సమాచారం అందుతోంది.

Duck Viral Video: పార్క్‌లో పసిపిల్లలను మరిపించిన బాతు.. దాని ఆట చూస్తే అదుర్స్ అనాల్సిందే..
Duck
Follow us
Shiva Prajapati

|

Updated on: Nov 01, 2021 | 5:22 PM

Duck Viral Video: సోషల్ మీడియా పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చాక ప్రపంచమే ఒక కుగ్రామంలా మారిపోయింది. ఖండాంతరాలలో ఏ మూలన ఏం జరిగినా జనాలకు ఇట్టే సమాచారం అందుతోంది. ఫేస్‌బుక్ రీల్స్, ఇన్‌స్టాగ్రమ్, యూట్యూబ్ వంటి వీడియో షేరింగ్ సాధనాలు అందుబాటులోకి వచ్చాక.. అనేక రకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా.. జంతువులు, పక్షులకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ఏ రేంజ్‌లో హల్ చల్ చేస్తున్నాయో మనందరికీ తెలిసిందే. ఇలాంటి వీడియోలు చూడటం ద్వారా ఒత్తిడి నుంచి ఉపశమనం పొందవచ్చు. అయితే, తాజాగా ఓ బాతుకు సంబంధించిన ఆసక్తికరమైన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది చూస్తే మీరు ఖచ్చితంగా వాట్ ఏ డక్ అంటారు.

ప్లే స్కూళ్లలో, పార్కులలో చిన్న పిల్లల కోసం ప్రత్యేకంగా ఆడుకునేందుకు కొన్ని పరికరాలు ఉంటాయి. జారుడు బండ, రంగుల రాట్నం లాంటి చిన్న చక్రాలు, ఊయల వంటివి ఉంటాయనే విషయం తెలిసిందే. పిల్లలు వాటితో సరదాగా ఆడుకుంటూ కాలక్షేపం చేస్తుంటారు. ఒక్కోసారి పెద్దలు కూడా పిల్లల్లా మారిపోయి వారితో పాటు కలిసి ఆడుతారు. అది వేరే విషయం అనుకోండి. తాజాగా ఓ బాతు.. పిల్లలను మరిపించేలా పార్క్‌లో తెగ సందడి చేసింది. చిన్న పిల్లలు ఎలాగైతే ఆడుకుంటారో.. అలా సరదాగా ఆడుకుంటూ ఔరా అనిపించింది. జారుడు బండపై నుంచి జారుతూ ఎంజాయ్ చేసింది. అది చూసి పార్క్‌కు వచ్చిన పబ్లిక్ కూడా సంబరపడిపోయారు. జారుడు బండపై నుంచి బాతు జారుతుండగా.. పలువురు వీడియో తీశారు. ఆ వీడియోను ఇన్‌స్టాగ్రమ్‌లో సెడక్టివ్ అనే అకౌంట్‌లో షేర్ చేయగా.. అది కాస్తా వైరల్‌గా మారింది. ఈ వీడియోను లక్షలాది మంది వీక్షించగా.. 25 వేలకు పైగా నెటిజన్లు లైక్స్ కొట్టారు.

బాతు వీడియోను చూసిన నెటిజన్లు చాలా ఫన్నీగా స్పందిస్తున్నారు. ఆ మేరకు కామెంట్స్ పెడుతున్నారు. ‘దానితో ప్రేమలో పడ్డాను’, ‘ఈ సంవత్సరంలో నేను చూసిన అత్యుత్తమ వీడియో ఇదే.’, ‘దానికి వాటర్ స్వింగ్ కావాలి.’ అంటూ ఇలా ఒక్కొక్కరు ఒక్కోలా కామెంట్స్ పెడుతున్నారు.

Viral Video:

Also read:

Viral Video: అడవి దున్నను చుట్టుముట్టిన సింహాలు.. ఇంతలో సీన్ రివర్స్.. వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే!

Viral Video: ఫేమస్ బ్యూటీషియన్‌లు కూడా పనికిరారు.. ఈ కోతి పని చూస్తే అవాక్కవ్వాల్సిందే..

Naga Shaurya: నాగ శౌర్య ఫార్మ్‌హౌస్ పేకాట కేసు.. రూ.6.7లక్షలు, మూడు కార్లు స్వాధీనం..FIR కాపీ.. వివరాల్లోకి వెళ్తే..

సెంచరీలతో కదం తొక్కిన సంజూ, తిలక్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
సెంచరీలతో కదం తొక్కిన సంజూ, తిలక్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
పుష్ఫ2 సినిమా నిర్మాతలకు 7 కోట్లు మిగిల్చిన శ్రీలీల.. ఎలాగంటే?
పుష్ఫ2 సినిమా నిర్మాతలకు 7 కోట్లు మిగిల్చిన శ్రీలీల.. ఎలాగంటే?
డయాలసిస్‌ ఎవరికి చేస్తారో తెలుసా..? ఇది చేయకపోతే ఏం జరుగుతుందంటే
డయాలసిస్‌ ఎవరికి చేస్తారో తెలుసా..? ఇది చేయకపోతే ఏం జరుగుతుందంటే
విద్యార్థులకు శుభవార్త.. అన్ని ప్రాథమిక పాఠశాలలు మూసివేత..!
విద్యార్థులకు శుభవార్త.. అన్ని ప్రాథమిక పాఠశాలలు మూసివేత..!
గుజరాత్ దగ్గర సముద్ర జలాల్లో అనుమానాస్పద నౌక..మన నేవీ తనిఖీ చేయగా
గుజరాత్ దగ్గర సముద్ర జలాల్లో అనుమానాస్పద నౌక..మన నేవీ తనిఖీ చేయగా
తనను కలిసేందుకు వచ్చిన దివ్యాంగురాలితో వరుణ్ ముచ్చట్లు.. వీడియో
తనను కలిసేందుకు వచ్చిన దివ్యాంగురాలితో వరుణ్ ముచ్చట్లు.. వీడియో
పిల్లల్లో పెరుగుతున్న మయోపియా వ్యాధి.. అసలిది ఎందుకు వస్తుందంటే?
పిల్లల్లో పెరుగుతున్న మయోపియా వ్యాధి.. అసలిది ఎందుకు వస్తుందంటే?
చావాలంటే బయట.. బతకాలంటే ఇంట్లో తినండి..! బాటమ్‌ లైన్‌ ఇది..!
చావాలంటే బయట.. బతకాలంటే ఇంట్లో తినండి..! బాటమ్‌ లైన్‌ ఇది..!
50 MP ట్రిపుల్ కెమెరా.. అదిరిపోయే ఫీచర్స్‌తో పోకో స్మార్ట్ ఫోన్
50 MP ట్రిపుల్ కెమెరా.. అదిరిపోయే ఫీచర్స్‌తో పోకో స్మార్ట్ ఫోన్
'అభివృద్ధికి విద్య తప్పనిసరి.. అందుకు భారత్ కేంద్రంగా మారాలి' RSS
'అభివృద్ధికి విద్య తప్పనిసరి.. అందుకు భారత్ కేంద్రంగా మారాలి' RSS