ఎంపీగారు కదా.. ఎలా వరద బురదలో అడుగు పెడతారు.. ప్రజలు భుజం ఎక్కించుకోవాల్సిందే.. వీడియో వైరల్

బీహార్‌లోని కతిహార్‌లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కాంగ్రెస్ ఎంపీ తారిఖ్ అన్వర్‌ను గ్రామస్తులు మోసుకెళ్తున్న వీడియో వైరల్‌గా మారింది. ఇది విమర్శలకు దారితీసింది. అయితే ఆయన నియోజకవర్గ పర్యటన సందర్భంగా ఆయన అనారోగ్యంతో ఉన్నారని, భారీ వర్షం, వేడి కారణంగా ఇబ్బంది పడ్డారని అందుకనే ఇలా ఎంపీని ప్రజలు మోసుకుని వెళ్తున్నట్లు ఎంపీ అనుచరుల బృందం స్పష్టం చేసింది.

ఎంపీగారు కదా.. ఎలా వరద బురదలో అడుగు పెడతారు.. ప్రజలు భుజం ఎక్కించుకోవాల్సిందే.. వీడియో వైరల్
Mp Tariq Anwar Carried By Villagers

Updated on: Sep 10, 2025 | 12:04 PM

బీహార్‌లోని కతిహార్‌లో వరద జన జీవనాన్ని అస్తవ్యస్తం చేసింది. ఈ వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలిస్తున్నప్పుడు ఎంపీ తారిఖ్ అన్వర్‌ను గ్రామస్తులు భుజాలపై మోసుకెళ్తున్న వీడియో వైరల్‌గా మారింది. కాంగ్రెస్ ఎంపీ తన నియోజకవర్గంలో రెండు రోజుల పర్యటనలో ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. పర్యటన సమయంలో అన్వర్ అనారోగ్యంతో ఉన్నారని వివరణ ఇచ్చినప్పటికీ.. వైరల్ అవుతున్న వీడియోపై వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నేతల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించే సమయంలో 74 ఏళ్ల ఎంపీ మొదట ట్రాక్టర్‌పై ప్రయాణించారు. అయితే నీటితో నిండిన ప్రాంతానికి చేరుకున్న తర్వాత.. గ్రామస్తులు ఆయనను మోసుకెళ్లారు. ఇప్పుడు వైరల్ అవుతున్న క్లిప్‌లో స్థానికులు అన్వర్‌ను ఎత్తుకుని వరదలున్న ప్రాంతం గుండా తీసుకెళ్తున్నట్లు చూపిస్తుంది.

 

ఇవి కూడా చదవండి

ఈ విషయంపై ఎంపీ బృందం మాట్లాడుతూ.. అన్వర్ కి తీవ్రమైన వేడి కారణంగా తల తిరిగిందని.. పర్యటన సమయంలో ఆయన అనారోగ్యంతో ఉన్నారని స్పష్టం చేశారు. భారీ వర్షాల కారణంగా ఏర్పడిన శిథిలాలలో అన్వర్ ప్రయాణిస్తున్న ట్రక్కు చిక్కుకుపోయిందని, దీంతో గ్రామస్తులు ఆయనను మోసుకెళ్లాల్సి వచ్చిందని చెప్పారు. బీహార్‌లో ఎన్నికలు ఈ ఏడాదిలో బహుశా అక్టోబర్ లేదా నవంబర్‌లో జరగనున్నాయి. అయితే భారత ఎన్నికల సంఘం ఇంకా అధికారికంగా ఎన్నికలు జరిగే తేదీలను ప్రకటించలేదు.

 

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..