Viral Video: జంతువులపై క్రూరత్వాన్ని ప్రదర్శించే వ్యక్తుల వీడియోలను చూస్తే ఎవరైనా కోపం కలగడం సహజం. తాజాగా సోషల్ మీడియా(Social Media)లో వైరల్ అవుతున్న ఓ వీడియో క్లిప్ లో జంతువుని హింసిస్తున్న వీడియో వైరల్ క్లిప్ దీనికి రుజువు. ఇద్దరు ఎద్దుల బండ్లను ద్విచక్ర వాహనంతో పరుగెత్తించే వీడియో ఒకటి IFS అధికారి సుశాంత నంద (Susanta Nanda IFS) ట్విట్టర్(Twitter) లో పోస్ట్ చేశారు. అయితే.. చివరికి ఎద్దు ఏమి చేసిందో నెటిజన్ల మనసును ఎలా గెలుచుకుందో తెలియాలంటే వీడియో చూడాల్సిందే.
21 సెకన్ల వీడియోలో.. రెండు ఎద్దుల బండ్లు మోటర్‌బైక్‌తో పోటీ పడుతూ రోడ్డుపై పరుగెత్తడం చూడవచ్చు. ఎద్దుల బండిపై కొందరు వ్యక్తులు ఎద్దులను వేగంగా .. బైక్ తో సమానంగా పరిగెత్తేలా చేస్తున్నారు. అందుకోసం ఎద్దులను పివిసి పైపుతో సహాయంతో నిరంతరం పొడుస్తూ ఉన్నారు. దీంతో ఒక ఎద్దుల బండిలోని ఎద్దు బండి నుంచి విదిపించుకునే ప్రయత్నం చేస్తూ.. డివైడర్‌వైపుగా దూసుకెళ్లింది. దీంతో బండి తిరబడింది. బండిలో ఉన్న మనుషులు ఒక్కసారిగా నేలమీద పడ్డారు. అక్కడ నుంచి ఎద్దు పారిపోయింది. ఇదంతా వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఎద్దు అదృష్టవశాత్తూ రోడ్డుపై ఉన్న మనుష్యులను తప్పించుకుంటూ.. రోడ్డు పక్కకు వెళ్ళేలా తీసుకుని వెళ్ళింది. లేదంటే.. బండి నుంచి కింద పడిన మనుషులు తీవ్ర ప్రమాదంలో పడేవారు.
Karma ?
(Watch till the end) pic.twitter.com/4ixpQ7Z5xO— Susanta Nanda IFS (@susantananda3) March 28, 2022
ఆన్‌లైన్‌లో షేర్ చేయబడిన ఈ వీడియో 1 లక్షకు పైగా వ్యూస్ ను సొంతం చేసుకుంది. సుశాంత నందా వీడియో తో పాటు చేసిన “కర్మ” వ్యాఖ్యతో నెటిజన్లు ఏకీభవించారు. ఇన్కమింగ్ ట్రాఫిక్ వల్ల బండి మీద నుంచి రోడ్డు మీద పడిన వ్యక్తులకు తీవ్ర గాయాలు కాలేదంటూ ఇది కొంచెం ఉపశమనం అంటూ వ్యాఖ్యానించారు. థాంక్ గాడ్ అవతలి వైపు నుండి భారీ వాహనం ఏదీ రావడం లేదు” అని ఒక వినియోగదారుడు కామెంట్ చేశాడు. మరొకరు “అద్భుతం.. ఎద్దు చాలా తెలివైనది.. తనను పెడుతున్న హింస నుండి తప్పించుకోవడానికి సరైన అవకాశాన్ని ఎంచుకుంది. క్రూరమైన వ్యక్తులను కూడా శిక్షించింది.” కొన్ని పనికిరాని ‘జంతువులు’ తమను పెట్టె హింసనుంచి తప్పించుకోవడానికి ఎద్దు చాలా అద్భుతమైన పని చేసింది. సహజంగానే జంతువు ప్రతీకారం తీర్చుకుంది.. చర్యకు ప్రతిచర్య ఉంటుంది. ఇది కర్మ.. అంటూ ఇంకొకరు.. ఇది నా జీవితంలో నేను చూసిన అత్యుత్తమ ముగింపు…కర్మ హిట్స్ బ్యాక్ మరొకరు.. ఇలా రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.
Vastu Tips: ఈ మొక్కను ఇంట్లో నాటడం శుభప్రదం.. దీని ప్రయోజనాలు ఏమిటంటే..(Photo Gallery)