Viral Video: బోనులో ఉన్న పులిని ఆటపట్టించిన ఆకతాయి.. సడెన్‌గా బోనులో చిక్కుకున్న చేయి..

|

Jun 06, 2022 | 9:03 AM

ఓ వ్యక్తి బోనులో బంధించి ఉన్న పులిని ఆటపట్టిస్తున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో(Social Media) చక్కర్లు కొడుతోంది.

Viral Video: బోనులో ఉన్న పులిని ఆటపట్టించిన ఆకతాయి.. సడెన్‌గా బోనులో చిక్కుకున్న చేయి..
Viral Video
Follow us on

Viral Video: ప్రపంచంలో చాలా మంది చాలా అతి తెలివి తేటలు కలిగి ఉంటారు. తమ వింత చేష్టలతో తమని తామే అపాయాల్లో పడేసుకుంటారు. ఏ విధంగా అంటే.. తాము కూర్చున్న కొమ్మని.. తామే నరుక్కుని .. తమని తామే కష్టాలు పాలు జేసుకుంటారు. ఇలాంటి వ్యక్తులను చూసినప్పుడు.. వారు పడిన ఇబ్బందులను గుర్తించి మరికొందరు.. వాటి నుంచి  పాఠాన్ని నేర్చుకోరు. ఇలాంటివారి చూసి ఆశ్చర్యం కలగడం సహజం. తాజాగా ఇలాంటి వీడియో ఒకటి తెరపైకి వచ్చింది. ఇందులో ఓ వ్యక్తి బోనులో బంధించి ఉన్న పులిని ఆటపట్టిస్తున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో(Social Media) చక్కర్లు కొడుతోంది.

అడవిలో కౄర జంతువుల గురించి మాట్లాడేటప్పుడు.. ముందుగా అడవికి రారాజు సింహం పేరు మొదట గుర్తుకొస్తుంది. అయితే సింహానికి ఏ మాత్రం తీసిపోని జంతువు.. పులి.  సింహం, పులి వంటి జంవుతులు అడవిలో కనిపిస్తే చాలు.. ఆమడ దూరం పరిగెడతాం.. ఇక పులి గర్జిస్తే చాలు అడవిలోని జంతువులు మొత్తం వణికిపోవాల్సిందే. అలాంటి  ఈ జంతువులు బోనులో ఉంటే.. వాటిని ఆటపట్టిస్తూ.. వాటిని ఇబ్బంది పెట్టె వ్యక్తులు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఓ  వ్యక్తి  పులిని ఆటపట్టిస్తున్న ఈ వీడియోను చూడండి.

ఇవి కూడా చదవండి

వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక వ్యక్తి బోనులో బంధించి ఉన్న పులిని కారణంగా ఇబ్బంది పెట్టడం మొదలు పెట్టాడు. ఆ వ్యక్తి తన చేతిని పులి ఉన్న బోనులో పెట్టాడు. మరికొన్ని సార్లు పులి వీపుపై చేయి పెట్టి కొట్టాడు. ఇక పులి మెడను తాకాడు. అంతటితో ఆగని వ్యక్తి పులి చెవిని కూడా లాగాడు. అంతటితో ఆగకుండా.. మళ్ళీ ఆ వ్యక్తి చేయి పులి బోనులో పెట్టాడు.. అప్పుడే షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. చేయి.. బోనులో ఇరుక్కుపోయింది. అయితే ఆ వ్యక్తికి అదృష్టం ఉంది. వ్యక్తి చేయి బోనులో ఇరుక్కున్న విషయాన్ని గమనించలేదు. దీంతో వెంటనే ఆ వ్యక్తి కంగారుగా తన చేతిని బోను నుంచి బయటకు తీసుకుని వెంటనే అక్కడ నుంచి క్షేమంగా బయటపడ్డాడు. లేదంటే.. పులికి ఆటపట్టించబోయి.. తన చేతిని పులికి ఆహారంగా ఇచ్చేయాల్సి వచ్చేది ఆ వ్యక్తి..

ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ ఘంటా అనే ఖాతా షేర్ చేశారు. ఇప్పటి వరకూ 29 లక్షల మందికి పైగా వీక్షించారు. పులి బోను లో ఉంది కనుక ఇలా ఇబ్బంది పెట్టాడు.. అదే.. బోను లో కాకుండా బయట ఉంటే ఇలా చేస్తాడా అంటూ రకరకాల కామెంట్స్ చేశారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..