
Viral Video: కదులుతున్న రైళ్లు నుంచి ప్రయాణీకులు ఎక్కడం, దిగడం ప్రమాదకరం రైల్వే అధికారులు, సిబ్బంది హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంటారు. అయినప్పటికీ చాలామంది ప్రయాణీకులు ఆ హెచ్చరికలను పట్టించుకోకుండా తమ ప్రాణాలమీదకు తెచ్చుకుంటూనే ఉన్నారు. తాజాగా ఓ ప్రయాణీకుడు రైలు ఎక్కేందుకు చేసిన ప్రయత్నం ఏకంగా ప్రాణాలమీదకు తెచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
ఘజియాబాద్‌లో రైల్వే స్టేషన్‌లో ఓ వ్యక్తి రైలు ఎక్కడానికి ప్రయత్నిస్తూ.. పట్టుదప్పి.. జారి పడిపోయాడు.. వెంటనే స్పందించిన రైల్వే పోలీసులు అతడిని రక్షించాడు. ఈ ఘటన శనివారం చోటు చేసుకుంది. కదులుతున్న రైలు ఎక్కేందుకు ప్రయత్నించి జారిపడిన వెంటనే ఆ వ్యక్తిని పోలీసులు సురక్షితంగా రక్షించారు. కదులుతున్న పూర్ణగిరి జనశతాబ్ది రైలు ఎక్కేందుకు వ్యక్తి ప్రయత్నిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటన అంతా రైల్వే స్టేషన్‌లోని సీసీటీవీ కెమెరాలో రికార్డైంది.
#AngelInKhaki#RPF ASI Rajendra Singh averted a tragedy and gave a new lease of life to a passenger who slipped while boarding & was dragging along with the moving train at Ghaziabad Railway Station.#MissionJeewanRaksha#LifesavingAct@RailMinIndia @rpfnr_ pic.twitter.com/xcEw4jaazZ
— RPF INDIA (@RPF_INDIA) September 12, 2022
రైల్వే స్టేషన్‌లో సీసీటీవీలో రికార్టైన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ASI రాజేంద్ర సింగ్ వేగంగా స్పందించి చాకచక్యంగా ఆ వ్యక్తి ట్రాక్ పై పడకుండా కాపాడిన దృశ్యాలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. ASI రాజేంద్ర సింగ్ పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..