Shocking Video: ఈ ప్రపంచంలోని జీవరాశుల్లో మొసలిని అతిపెద్ద జంతువుగా పరిగణిస్తారు. ఇక నీటిలో ఉంటే దాని బలం మరింత రెట్టింపవుతుంది. అందుకే ఏనుగులాంటి పెద్ద పెద్ద జంతువులు కూడా దాని జోలికి పోవడానికి జంకుతాయి. ఇక మనుషులైతే దాని దరిదాపులకు కూడా పోరు. వాటిని చూస్తేనే గుండి ఆగినంత పనవుతుంది. అలాంటిది ఓ వ్యక్తి మాత్రం ఎలాంటి భయం లేకుండా మొసలితో ఆటలాడుతున్నాడు. ఏదో పెంపుడు పిల్లి, కుక్కతో ప్రవర్తించినట్లు మొసలితో సరదాగా ఆటలాడాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.
ఈ వీడియోలో ఒక వ్యక్తి పడవ తీసుకుని సరస్సులోకి వెళతాడు. నీటి మధ్యలో ఆగి అక్కడున్న మొసలిని పిలుస్తాడు. ఆ వ్యక్తి నీటిలో తన కాళ్లను పెట్టగా.. మొసలి అతడి కాళ్ల మధ్యలోకి వస్తుంది. అప్పుడు అతను ఓ చేతితో మొసలిని పట్టుకుని.. మరో చేతిలో ఒక చిన్న మాంసం పట్టుకుంటాడు. మొసలి ఆ మాంసం ముక్కను అందుకునే ప్రయత్నం చేస్తుంది. కానీ ఆ వ్యక్తి అందకుండా చేతిని పైకి లేపుతూ దానిని ఆట పట్టిస్తాడు. అయినా కూడా ఆ మొసలి అతడిని ఏమీ అనదు. చివరకు మొసలికి మాంసం ముక్కను అందిస్తాడు. ఆపై దాని తలపై ప్రేమగా దువ్వుతాడు. దీంతో మాంసం ముక్కను తింటూ మళ్లీ నీటిలోకి వెళ్లిపోతుంది. ఫిజిన్ అనే ట్విటర్ యూజర్ ఈ వీడియోను పోస్ట్ చేయగా అది కాస్తా నెట్టింట్లో వైరల్‌గా మారింది. మిలియన్ల మంది ఈ వీడియోను వీక్షించారు. ‘మొసలితో ఆటలేంటి సామీ?’, ‘బహుశా అతను ట్రైనర్ అయి ఉండచ్చేమో’ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మరి మీరు కూడా ఈ షాకింగ్ వీడియోపై ఓ లుక్కేయండి.
What type of pet is that bro?pic.twitter.com/SjlJRYJsDA
— Figen (@TheFigen) August 2, 2022
మరిన్ని ట్రెండింగ్ వార్తలపై ఓ లుక్కేయండి..