Viral Video: టేబుల్‌ ఫ్యాన్‌తో యువకుడి అద్భుత ఆవిష్కరణ… యువకుడి ఐడియాకి నెటిజన్లు ఫిదా

జుగాడ్‌లు తయారుచేయడంలో భారతీయులను మించినవారుండరు అనడంలో అతిశయోక్తి లేదు. పనికిరావని పడేసే వస్తువులను కూడా అద్భుతంగా రీ యూజ్‌ చేస్తుంటారు. వీరి తెలివితేటలకు నిజంగా హ్యాట్సాఫ్‌ అనాల్సిందే. ఓ యువకుడు చేసిన జుగాడ్‌ నెటిజన్లను కట్టిపడేస్తోంది. ఓ టేబుల్ ఫ్యాన్‌ను అద్భుతమైన ఏసీగా మార్చేశాడు. అది చూసి నెటిజన్లు ఏం ఐడియా గురూ ...

Viral Video: టేబుల్‌ ఫ్యాన్‌తో యువకుడి అద్భుత ఆవిష్కరణ... యువకుడి ఐడియాకి నెటిజన్లు ఫిదా
Jugad Table Fan Ac

Updated on: Apr 17, 2025 | 5:21 PM

జుగాడ్‌లు తయారుచేయడంలో భారతీయులను మించినవారుండరు అనడంలో అతిశయోక్తి లేదు. పనికిరావని పడేసే వస్తువులను కూడా అద్భుతంగా రీ యూజ్‌ చేస్తుంటారు. వీరి తెలివితేటలకు నిజంగా హ్యాట్సాఫ్‌ అనాల్సిందే. ఓ యువకుడు చేసిన జుగాడ్‌ నెటిజన్లను కట్టిపడేస్తోంది. ఓ టేబుల్ ఫ్యాన్‌ను అద్భుతమైన ఏసీగా మార్చేశాడు. అది చూసి నెటిజన్లు ఏం ఐడియా గురూ .. దీనిముందు ఏసీలు కూడా దిగదుడుపే అంటున్నారు.

ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి. ఏసీ కొనాలంటే చాలా ఖర్చవుతుంది. అందరూ ఏసీలు కొనలేరు కదా.. అలాంటప్పుడే ఇలాంటి ఐడియాలు వస్తుంటాయి. అవసరాల్లోంచి పుట్టే ఆలోచనలే అద్భుతాలను సృష్టిస్తాయి. అలా ఓ యువకుడు వేసవి తాపం నుంచి ఉపశమనం పొందడానికి తన ఇంట్లో ఉన్న టేబుల్ ఫ్యాన్‌ను ఏసీగా మలచిన తీరు ఆకట్టుకుంటోంది. టేబుల్ ఫ్యాన్‌ను తీసుకొచ్చి.. దాని వెనుక ఉన్న కవర్‌ను తీసేసాడు. ఓ వాటర్‌ బాటిల్‌ తీసుకొని దాని బ్యాక్‌సైడ్‌ కట్‌ చేశాడు. ఇప్పుడది వాటర్‌ ను డబ్బాల్లో నింపుకోడానికి వాడుకునే గళ్లాలాగా తయారైంది, దీనిని ఫ్యాన్‌ వెనుక కవర్‌ తీసేసిన చోట అమర్చాడు. దీనికి ఓ పైపు జాయిట్ చేశాడు. అలాగే ఫ్యాన్‌ ముందు భాగంలో కూడా ఇదేమాదిరిగా ఓ పైపు అమర్చాడు. ఆ తర్వాత ఒక థెర్మోకోల్‌ బాక్స్‌ తీసుకొని దానిని ఐస్‌ ముక్కలతో నింపాడు.

 

వీడియో చూడండి:

 

 

 

 

ఇప్పుడు వాటర్‌ బాటిల్‌కి అమర్చిన రెండు పైపులను ఐస్‌ ముక్కలు వేసిన బాక్స్‌కి జాయింట్‌ చేశాడు. ఇప్పుడు మామూలుగానే ఫ్యాన్‌ ఆన్‌ చేశాడు. ఐస్ బాక్స్‌లోని చల్లదనం మొత్తం ఫ్యాన్ గుండా బయటికి రావడంతో.. చల్లచల్లని కూల్‌కూల్‌.. అంటూ ఏసీని మించిన చల్లగాలితో హాయిగా సేదదీరాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇప్పటి వరకూ 9 మిలియన్ల మందికి పైగా ఈ వీడియోను వీక్షించారు. 2 లక్షలమందికి పైగా లైక్‌ చేశారు. ఈ యువకుడి వింత ప్రయోగం చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. టేబుల్ ఫ్యాన్‌తో ఏసీ ఎఫెక్ట్.. అదిరింది..అంటూ కామెంట్లు చేస్తున్నారు.