Viral Video: సోషల్ మీడియాలో ప్రతిరోజు చాలా వీడియోలు వైరల్ అవుతుంటాయి. అందులో చాలా రకాల వీడియోలు ఉంటాయి. కొన్ని వీడియోలు చాలా ఫన్నీగా ఉంటాయి. మరికొన్ని వీడియోలు చాలా ఎమోషనల్‌గా ఉంటాయి ఇంకొన్ని వీడియోలు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. సాధారణంగా నెటిజన్లు తమాషా వీడియోలను ఎక్కువగా చూడటానికి ఇష్టపడతారు. అలాంటి ఒక ఫన్నీ వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట్లో హల్‌చల్ చేస్తుంది. ఇది చూస్తే మీరు కూడా నవ్వకుండా ఉండలేరు. ఎందుకంటే ఈ వీడియోలో బంతి క్యాచ్ పట్టే విధానం చాలా ఫన్నీగా ఉంటుంది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో కొంతమంది ఒక బిల్డింగ్‌లో గుమిగూడుతారు. అందులో ఒక వ్యక్తి బంతిని ఎదురుగా ఉన్న బిల్డింగ్ వైపు విసరడం మనం వీడియోలో గమనించవచ్చు. అయితే అవతలి బిల్డింగ్ పైన ఉన్న ఒకతను ఆ బంతిని క్యాచ్ పట్టాడానికి ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో అతడు బిల్డింగ్ పై నుంచి కిందపడిపోతాడు.
అతడు పడిపోతున్నప్పుడు పైకప్పు రెయిలింగ్‌ను పట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు. కానీ అతను తనను తాను బ్యాలెన్సింగ్ చేసుకోలేకపోతాడు. దీంతో నేరుగా కిందపడిపోతాడు. అయితే వీడియో చూశాక అతడికి పెద్దగా గాయాలేమి అవలేదని అర్థమవుతుంది. ఎందుకంటే కింద పడిన వెంటనే అతను లేచి మళ్లీ బంతి కోసం పరుగెత్తడం మనం వీడియోలో చూడవచ్చు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు తెగ స్పందిస్తున్నారు.
ఈ ఫన్నీ వీడియో @ViralPosts5 పేరుతో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఈ 14 సెకన్ల వీడియోని ఇప్పటివరకు 15 వేల మందికి పైగా చూశారు. వందలాది మంది వీడియోను కూడా లైక్ చేశారు. అంతేకాదు వీడియో చూసిన తర్వాత నెటిజన్లు వివిధ రకాల రియాక్షన్‌లు ఇచ్చారు. ఈ వీడియో చూసిన తర్వాత మీరు నవ్వుకుంటారు. అలాగే మీ కామెంట్ ఏంటో తెలియజేయండి.
Catch! pic.twitter.com/FPRkks0Pd4
— ViralPosts (@ViralPosts5) March 20, 2022