AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: తన మానాన తాను ఈదుతూ వెళ్తున్న పాముతో ఎకశకాలు.. చివర్లో ఊహించని ట్విస్ట్

జనాలు నీటిలో సేదతీరుతున్నారు. ఈ క్రమంలో ఓ పాము అటుగా ఈదుతూ వచ్చింది. ఈ క్రమంలోనే ఓ వ్యక్తి దాన్ని పట్టి పరాచకాలు ఆడాడు.. కట్ చేస్తే...

Viral Video: తన మానాన తాను ఈదుతూ వెళ్తున్న పాముతో ఎకశకాలు.. చివర్లో ఊహించని ట్విస్ట్
Snake Viral Video
Ram Naramaneni
|

Updated on: Jul 29, 2022 | 4:02 PM

Share

Trending Video: పామును చూసి నూటికి 90 శాతం మంది భయపడతారు. పాము బొమ్మలు చూసి కూడా జడుచుకునే వాళ్లు ఉంటారు. అయితే అన్ని పాములు హానికరం కావు. కొన్ని పాములు విషం లేకుండా ఉంటాయి. ఇంకొన్ని పాములు ఎలుకల్ని వేటాడుతూ వరి, గోధుమ రైతులకు మేలు చేకూరుస్తాయి. ఏ పాము అయినా సరే.. తన ప్రాణాలకు ముప్పు అని భావిస్తేనే కాటు వేస్తుంది. అయితే పాముతో పరాచకాలు ఆడితే మాత్రం చాలా డేంజర్. తాజాగా అలాంటి ఓ వీడియో నెట్టింట ట్రెండ్ అవుతుంది. కొందరు వ్యక్తులు సముద్రతీరంలో నీటిలో సేదతీరుతున్నారు. ఇంతలో ఓ పాము వేగంగా ఈదుకుంటూ అటుగా వచ్చింది. తన మానాన తాను వెళ్తున్న ఆ పామును ఓ వ్యక్తి పట్టేశాడు. దాన్ని నీటిలో కాసేపు అటూ.. ఇటూ ముంచాడు. దీంతో ఆ పాముకు కోపం వచ్చి.. పడగ విప్పబోతుండగా.. దాన్ని అమాంతం దూరంగా విసిరేశాడు. ఇక్కడే అసలు చిక్కొచ్చిపడింది. ఆ పాము ఓ ట్యూబ్‌పై నీటిలో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులపై పడింది. దీంతో వారు ఒక్కసారిగా కంగుతిన్నారు. ఒక్క ఉదుటన పక్కకి దూకేసి ఆ పాము భారి నుంచి తప్పించుకున్నారు. ఈ వీడియోను ఐపిఎస్ అధికారి దీపాంషు కబ్రా ట్విట్టర్‌లో షేర్ చేశారు, “లక్ష్యమే కాదు, గురి కూడా సరిగ్గా ఉండాలి” అని క్యాప్షన్ రాశారు. ప్రజంట్ ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తూ వైరల్ చేస్తున్నారు.

వీడియో దిగువన చూడండి…

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి