
Trending Video: సోషల్ మీడియా(Social Media)లో వైరల్ వీడియోలు నిత్యం ట్రెండ్ అవుతూనే ఉంటాయి. ఎప్పుడూ ఏదొకటి వైరల్ అవుతూనే ఉంటుంది. మరీ ముఖ్యంగా జంతువుల కంటెంట్ నెటిజన్లను తెగ ఆకర్షిస్తుంది. జంతువులు, వాటి వేట, వాటీ జీవన విధానానికి సంబంధించి సోషల్ మీడియాలో నిత్యం వేలాది వీడియోలు మనం చూస్తూనే ఉంటాం. తాజాగా ఆ కోవకు చెందిన ఓ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. అదేంటో చూసేద్దాం పదండి. అడవికి రాజు సింహం. ఇది అందరికీ తెలిసిన విషయం. సాధారణంగా సింహానికి ఆకలేస్తే.. ఆ రోజు అడవిలో ఏదో ఒక జంతువుకు ఆయువు మూడినట్లే. అవతల ఎలాంటి జంతువు ఉన్నా సరే.. సింహాన్ని చూస్తే ఆమడదూరం పరిగెడతాయి. దాని గర్జన వింటేనే భయంతో పరగులు తీస్తాయి. అయితే అంతటి బలశాలి అయిన సింహానికి దాదాపు చావును చూపించాయి మొసళ్లు. ఒక కొలనులో ఓ చనిపోయిన జంతువుపై సింహం నిలబడి ఉంది. ఆ భారీ జంతువును సింహం వెంటాడి చంపింది అని మనం అంచనా వేయవచ్చు. అయితే సింహం తన ఆకలిని తీర్చుకోకముమందే.. అక్కడికి పదుల సంఖ్య మొసళ్లు చేరకున్నాయి. భారీ జంతువుపై నిలబడి ఉన్న సింహాన్ని రౌండప్ చేశాయి. అది కనీసం అక్కడి నుంచి తప్పించుకునేందుకు కూడా వీలు లేకుండా పోయింది. అడుగు ముందుకు వేద్దామంటే.. ముసళ్లు నోరు తెరిచి ముందుకు వస్తున్నాయి. దీంతో ఇక లాభం లేదనుకుంది సింహం. ఏదైతే.. అది అవుతుంది అనుకుని.. నీటిలోకి దూకి మెరుపు వేగంతో అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యింది. ప్రజంట్ ఈ వీడియో నెట్టింట్ తెగ వైరల్ అవుతుంది.
వీడియో దిగువన చూడండి…
మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..