Viral Video: పోలీసులపై పంజా విసిరిన చిరుత.. ప్రాణాలకు తెగించి ఎలా బంధించారో మీరే చూడండి..

Viral Video:  ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోలీసులు చిరుతతో పోరాడారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.

Viral Video: పోలీసులపై పంజా విసిరిన చిరుత.. ప్రాణాలకు తెగించి ఎలా బంధించారో మీరే చూడండి..

Updated on: May 09, 2022 | 10:33 PM

Viral Video:  పోలీసులంటే సేవకు మారుపేరు. ప్రజలకు సమస్యలు ఎదురైతే ఎలాంటి సమయాల్లోనైనా వచ్చి ఆదుకుంటారని ఒక గట్టి నమ్మకం. ఎలాంటి క్లిష్ట పరిస్థితులెదురైనా ధైర్యంగా నిలబడతారని ఒక నమ్మకం. ఈ మాటలు నిజమని మరోసారి నిరూపించారు హరియాణా పోలీసులు. ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోలీసులు చిరుతతో పోరాడారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. హరియాణా రాష్ట్రం పానిపట్‌ జిల్లా బెహ్రాంపూర్ గ్రామంలోకి ఓ చిరుత పులి వచ్చింది. దీంతో భయబ్రాంతులకు గురైన ప్రజలు.. పోలీసులకు సమాచారం అందించారు. పులిని బంధించేందుకు ముగ్గురు పోలీసులు, అటవీ అధికారులు వెంటనే రంగంలోకి దిగారు. చిరుతను బంధించేందుకు ప్రత్యేక అపరేషన్‌ చేపట్టారు. అయితే దురదృష్టవశాత్తూ చిరుత తిరగబడింది పోలీసులు, అటవీ అధికారులపై దాడికి ఎగబడింది. కర్రలతో, రాళ్లతో బెదిరించినా పంజా విసిరింది. గోళ్లతో పోలీసుల చర్మంపై రక్కింది. దీంతో స్టేషన్‌ హౌజ్‌ ఆఫీసర్‌తోపాటు ఇద్దరు అటవీశాఖ అధికారులు తీవ్రంగా గాయపడ్డారు. అయినప్పటికీ ఎట్టకేలకు చిరుతపులిని విజయవంతంగా బంధించారు.

కాగా పులిని బంధించడంలో కీలకంగా వ్యవహరించిన పోలీసులకు పానిపట్‌ జిల్లా ఎస్పీ శశాంక్ కుమార్ సావన్ అభినందనలు తెలిపారు. సోషల్ మీడియా వేదికగా వారి తెగువను ప్రశంసించారు. ‘పోలీసులు, అటవీ శాఖ ప్రజలకు విధి నిర్వాహణలో కష్టమైన రోజు. ఇందులో ఇద్దరు, ముగ్గురు గాయపడ్డారు.. వారి ధైర్యానికి, సాహసానికి సెల్యూట్‌. చివరికి, చిరుతపులితో సహా అందరూ సురక్షితంగా బయటపడ్డారు’ అని ట్విట్టర్‌లో రాసుకొచ్చారు. కాగా ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. పోలీసుల తెగువను చూసి నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Also Read:

KGF Chapter2: ఖండాంతరాలు దాటుతోన్న కేజీఎఫ్‌ ఖ్యాతి.. ఆ దేశంలో ప్రదర్శించిన తొలి కన్నడ చిత్రంగా అరుదైన రికార్డు..

IPL 2022: ముంబై ఇండియన్స్‌కు భారీ షాక్‌.. గాయంతో సీజన్‌ మొత్తానికి దూరమైన ఆ స్టార్‌ ఆటగాడు..

Viral Video: పెళ్లి మంటపాన్ని ముంచెత్తిన వర్షం.. అయినా వెనకడుగు వేయని వధూవరులు.. ఎలా ఏకమయ్యారో మీరే చూడండి..