Viral Video: కోర్టు విచారణలో మహిళకు ముద్దు పెట్టిన లాయర్… ఏకి పారేస్తున్న నెటిజన్స్‌

టెక్నాలజీ అభివృద్ది చెందిన తర్వాత అన్నీ పనులు ఆన్‌లైన్‌ ద్వారానే చకచకా జరిగిపోతున్నాయి. ఆఖరికి కోర్టు కేసుల వాదనలు, తీర్పులు కూడా వర్చువల్‌గానే జరుగుతున్నాయి. వర్చువల్ మీటింగ్‌ల్లో అప్పుడప్పుడు కొన్ని ఊహించని సంఘటనలు జరుగుతుంటాయి. అలాంటి సంఘటనలకు సంబంధించిన దృశ్యాలు సోషల్...

Viral Video: కోర్టు విచారణలో మహిళకు ముద్దు పెట్టిన లాయర్... ఏకి పారేస్తున్న నెటిజన్స్‌
Lawyer Kissing Woman

Updated on: Oct 16, 2025 | 4:33 PM

టెక్నాలజీ అభివృద్ది చెందిన తర్వాత అన్నీ పనులు ఆన్‌లైన్‌ ద్వారానే చకచకా జరిగిపోతున్నాయి. ఆఖరికి కోర్టు కేసుల వాదనలు, తీర్పులు కూడా వర్చువల్‌గానే జరుగుతున్నాయి. వర్చువల్ మీటింగ్‌ల్లో అప్పుడప్పుడు కొన్ని ఊహించని సంఘటనలు జరుగుతుంటాయి. అలాంటి సంఘటనలకు సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంటాయి. తాజాగా అలాంటి వీడియోనే ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది.

వర్చువల్‌లో కోర్టు విచారణ లైవ్‌లో ఉండగా లాయర్ ఒక మహిళను ముద్దు పెట్టుకుంటున్న దృశ్యం ఇప్పుడు నెట్టింట హల్‌చల్‌ సృష్టిస్తోంది. ఢిల్లీ హైకోర్టు వర్చువల్ విచారణ సందర్భంగా ఈ ఊహించని సంఘటన వెలుగులోకి వచ్చింది. ఓ కేసు ఆన్‌లైన్ విచారణ జరుగుతుండగా లాయర్ ఒకరు మహిళను దగ్గరకు లాక్కుని కిస్‌ చేశారు. ఈ దృశ్యాలు అక్కడి కెమెరాలో రికార్డ్‌ కావడంలో అవి కాస్తా వైరల్‌గా మారాయి.

వీడియో చూడండి:

వీడియోలో లాయర్ నల్ల కోటు ధరించి తన రూమ్‌లో కూర్చుని ఉండటం కనిపిస్తుంద. కెమరా నుంచి కాస్త దూరంలో ఉన్నారు కనుక ముఖం స్పష్టంగా లేదు. ఇంతలో ఆ గదిలోకి ఒక మహిళ రావడం చూడొచ్చు. లాయర్ ఆమె చేతిని పట్టుకుని దగ్గరకు లాక్కోవడం కనిపిస్తుంది. ఆ మహిళ విడిపించుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఉంది. కానీ లాయర్ ఆమెను విడిచిపెట్టకుండా దగ్గరకు లాక్కుని ముద్దు పెట్టుకుంటాడు. ఆ తర్వాత మహిళ అక్కడ నుంచి వెళ్లిపోవడంతో వీడియో ముగుస్తుంది. అయితే ఈ సంఘటన జరిగినప్పుడు కోర్టుకు ఇంకా న్యాయమూర్తి రాలేదని, జనాలు ఆయన రాకకోసం ఎదురు చూస్తున్నట్లు సమాచారం.

వీడియోను సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వీడియోలో ఉన్న లాయర్, మహిళ ఎవరూ అనే వివరాలు తెలియదు. కానీ నెటిజన్స్‌ మాత్రం లాయర్ తీరును తీవ్రంగా తప్పుపడుతున్నారు. లాయర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.