పాముల గురించి మాట్లాడినప్పుడల్లా ముందుగా గుర్తుకు వచ్చేది కింగ్ కోబ్రా. ఈ జీవి చాలా విషపూరితమైనది. తన విషంతో ఇది ఎవరినైనా సులభంగా చంపగలదు. మానవులు, జంతువులు కూడా కింగ్ కోబ్రాకు దూరంగా ఉండటమే మంచిదని భావించడానికి ఇదే కారణం. తాజాగా కింగ్ కోబ్రాకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఇక్కడ నాగ పాము ఎరను తినే సమయంలో జరిగిన సంఘటన వీడియో వైరల్ అవుతుంది. ఇది చూసిన తర్వాత ఎవరైనా ఆశ్చర్యపోతారు.
సరీసృపాలు తమ ఎరను నమలవు. అయితే పాముల్లో కొండచిలువ ఎర పట్టే విధానం ఇతర పాములకంటే భిన్నంగా ఉంటుంది. మొదట తన ఎరను పట్టుకుని, ఆపై దానిని మింగడం తరచుగా మీరు చూసే ఉంటారు. అయితే ఇలా కొండచిలువలతో మాత్రమే కనిపిస్తుంది. అయితే ఇలా కొన్నిసార్లు నాగుపాములు కూడా తమ ఆహారాన్ని మింగేస్తాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఒక కింగ్ కోబ్రా.. మానిటర్ బల్లిని మిగేసినట్లు ఉంది.
వైరల్ అవుతున్న వీడియోలో కింగ్ కోబ్రా పరిస్థితి బాగా లేదని చూస్తే అర్ధం అవుతుంది. తన శారీరక తీరుకు, అవసరానికి మించి పెద్ద వేటను మింగేసినట్లు తెలుస్తోంది. అప్పుడు ఆ ఎరను కక్కేందుకు నోరు తెరచింది. అప్పుడు కింగ్ క్రోబా నోటి నుంచి ఒక జీవి తోక కనిపించింది. తర్వాత నెమ్మదిగా పాము ఆ జీవిని ఉమ్మివేస్తోంది. క్లిప్ చివరిలో దాని నోటి నుంచి పెద్ద మానిటర్ బల్లి వచ్చింది. కింగ్ కోబ్రా ఎరగా పెద్ద మానిటర్ బల్లిని మింగి ఇబ్బంది పడినట్లు తెలుస్తోంది.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..