Viral Video: కారు ఆపినందుకు ఈ జపనీస్ వ్యక్తులు చేసినదానికి ఫిదా అవ్వాల్సిందే!

|

May 13, 2024 | 1:36 PM

ప్రపంచమంతా ఒకలా ఆలోచిస్తూ ఉంటే.. జపాన్ మాత్రం మరోలా ఆలోచిస్తుంది. ఆ డిఫరెంట్ ఆలోచనలతోనే.. జపాన్ దేశం ఎంతో ముందు ఉంది. జపాన్ దేశానికి సంబంధించిన ఎన్నో వీడియోలను ఇప్పటికే మీరు సోషల్ మీడియాలో చూసే ఉంటారు. అన్ని దేశాల కంటే.. జపాన్ దేశం ఎప్పుడూ ముందు ఉంటుంది. అక్కడ ఉండే టెక్నాలజీ వేరే లెవల్ అని చెప్పొచ్చు. ఇప్పుడు జపాన్ దేశం గురించి ఎందుకు టాపిక్ వచ్చిందనేదేగా మీ డౌట్..

Viral Video: కారు ఆపినందుకు ఈ జపనీస్ వ్యక్తులు చేసినదానికి ఫిదా అవ్వాల్సిందే!
Viral Video
Follow us on

ప్రపంచమంతా ఒకలా ఆలోచిస్తూ ఉంటే.. జపాన్ మాత్రం మరోలా ఆలోచిస్తుంది. ఆ డిఫరెంట్ ఆలోచనలతోనే.. జపాన్ దేశం ఎంతో ముందు ఉంది. జపాన్ దేశానికి సంబంధించిన ఎన్నో వీడియోలను ఇప్పటికే మీరు సోషల్ మీడియాలో చూసే ఉంటారు. అన్ని దేశాల కంటే.. జపాన్ దేశం ఎప్పుడూ ముందు ఉంటుంది. అక్కడ ఉండే టెక్నాలజీ వేరే లెవల్ అని చెప్పొచ్చు. ఇప్పుడు జపాన్ దేశం గురించి ఎందుకు టాపిక్ వచ్చిందనేదేగా మీ డౌట్.. ఆగండి అసలు విషయానికి వచ్చేద్దాం. ఇప్పుడు మనం మాట్లాడుకునే ఈ వీడియోని చాలా మంది చూసే ఉంటారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఎక్కడ చూసినా ఈ వీడియో గురించే డిస్కర్షన్. అంతలా ఈ వీడియో చూపరులను ఆకర్షించింది. ఈ వీడియో జపనీయుల సంస్కారానికి నిదర్శనంగా నిలిచింది.

జపాన్‌లోని ప్రజలు పరిశుభ్రత, రీసైక్లింగ్‌ పై ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తారు. అంతే కాకుండా పనాద చారులు, డ్రైవింగ్, సైక్లింగ్‌లో మర్యాదలను పాటించడం వంటివి వారి జీవిత దినచర్యలో ఒక భాగం. ఈ వీడియోను మైక్రోబ్లాగింగ్ ఫ్లాట్ ఫారమ్ X షేర్ చేసిన వీడియోల్లో ఇది కూడా ఒకటి. ఈ వీడియో క్లిప్‌లో లోపలి నుంచి ఒక కారు వస్తుంది. దీంతో డోర్ దగ్గర నిలబడ్డవారు.. వెంటనే ఎదురుగా వచ్చే కార్లను ఆపుతారు. ఈలోపు లోపలి నుంచి వచ్చే కారు బయటకు వెళ్లిపోతుంది. ఆ కారుకు దారి ఇచ్చినందుకు.. ఇతర కార్ డ్రైవర్లకు గౌరవ సూచకంగా నమస్కరించడం మరియు వారి వాహనాలను ఆపినందుకు ధన్యవాదాలు తెలిపారు.

అవతలి లేన్ నుంచి వచ్చిన వాహనాలకు మళ్లీ నమస్కరించి గౌరవం ఇచ్చారు. @Rainmaker 1973 పేరుతో ఉన్న ఖాతా ద్వారా వీడియో అప్‌లోడ్ చేయబడింది. ఈ వీడియో చూసిన వారు జపనీయుల గౌరవానికి ముగ్ధులవుతున్నారు. వీళ్లు ఎంతో మంది హృదయాలను గెలుచుకున్నారు. ఈ వీడియోను ఇప్పటి వరకూ 23.3 మిలియన్ల మంది చూశారు. వేల మంది నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియో మీరు కూడా చూసేయండి.