Viral Video: నుదుటిపై లవ్ సింబల్.. 2300 మైళ్ల శాంతియాత్ర.. ఇండియన్ స్ట్రీట్ డాగ్ అలోకాకు అమెరికన్లు ఫిదా
అమెరికాలో శాంతి, ఐక్యత, దయను పెంపొందించే లక్ష్యంతో 19 మంది బౌద్ధ సన్యాసులు టెక్సాస్ నుండి వాషింగ్టన్ డి.సి. వరకు 2,300 మైళ్లు అంటే సుమారు 3,700 కి.మీ. సుదీర్ఘ పాదయాత్ర చేపట్టారు. అక్టోబర్ 26, 2025న ప్రారంభమైన ఈ 120 రోజుల పాటు...

అమెరికాలో శాంతి, ఐక్యత, దయను పెంపొందించే లక్ష్యంతో 19 మంది బౌద్ధ సన్యాసులు టెక్సాస్ నుండి వాషింగ్టన్ డి.సి. వరకు 2,300 మైళ్లు అంటే సుమారు 3,700 కి.మీ. సుదీర్ఘ పాదయాత్ర చేపట్టారు. అక్టోబర్ 26, 2025న ప్రారంభమైన ఈ 120 రోజుల పాటు యాత్ర కొనసాగనుంది. వారు అలోకా అనే ఒక కుక్కతో కలిసి యాత్ర సాగిస్తున్నారు. సమాజంలో సామరస్యాన్ని పెంపొందించడానికి ప్రయత్నిస్తున్నారు.
అయితే బౌద్య సన్యాసుల యాత్రలో శునకం అలోకా స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ప్రతి అడుగులోనూ వారికి తోడుగా ఉండి యాత్రలో భాగంగా మారింది. దీంతో నెటిజన్ల హృదయాలను గెలుచుకుంది.
శాంతి యాత్ర జార్జియా గుండా సాగుతున్నప్పుడు, హైవేల వెంబడి కేవలం సన్యాసులు మాత్రమే కాదు, అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. సోషల్ మీడియాలో ముద్దుగా “పీస్ డాగ్” అని పిలువబడే అలోకా, ఈ యాత్రలో అత్యంత సుపరిచితమైన ముఖాలలో ఒకటిగా మారింది. తన నుదుటిపై ప్రేమకు ప్రతిరూపంగా భావించే లవ్ సింబల్ ఉంది. అలోకా తరచుగా సన్యాసుల పక్కన నిశ్శబ్దంగా నడుస్తూ కనిపిస్తుంది. కొన్నిసార్లు ముందుకు పరుగెడుతుంది. అప్పుడప్పుడు విశ్రాంతి అవసరమైనప్పుడు వాహనంలో ప్రయాణిస్తుంది.
అలోకాకు సుమారు నాలుగు సంవత్సరాల వయస్సు ఉంటుంది. అది ఒక భారతీయ వీధి కుక్క అని చెబుతున్నారు. అంతకు ముందు జరిగిన ఒక శాంతి యాత్రలో సన్యాసులతో చేరింది. వారిని నమ్మకంగా అనుసరించింది. వారిని విడిచి వెళ్ళడానికి నిరాకరించిన తర్వాత, అలోకా వారి ప్రయాణంలో శాశ్వత భాగమైంది. దాని విధేయత ఇప్పుడు అమెరికా అంతటా మైళ్ల కొద్దీ విస్తరించింది.
వీడియో చూడండి:
View this post on Instagram
