AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: లవర్‌వా..లఫంగవ్‌రాబై.. మంచం కింద ఎందుకు దూరినవరా బాబు…

ఇటీవల భార్య భర్తల మధ్య సంబంధాలు చెడిపోతున్నాయి. చివరి శ్వాస వరకు నీకు నేను, నాకు నీవు అని పచ్చటి పెళ్లి పీటల మీద చేసుకున్న బాసలు కాళ్ల పారాణి ఆరకముందే చెరిగిపోతున్నాయి. అర్దాంతరంగా అక్రమ సంబంధాలకు తెగించి కట్టుకున్నోళ్లకు కన్నీళ్లు మిగులుస్తున్నారు. భర్తను భార్యలు, భార్యలను...

Viral Video: లవర్‌వా..లఫంగవ్‌రాబై.. మంచం కింద ఎందుకు దూరినవరా బాబు...
Secret Lover Hidden Under B
K Sammaiah
|

Updated on: Sep 26, 2025 | 6:11 PM

Share

ఇటీవల భార్య భర్తల మధ్య సంబంధాలు చెడిపోతున్నాయి. చివరి శ్వాస వరకు నీకు నేను, నాకు నీవు అని పచ్చటి పెళ్లి పీటల మీద చేసుకున్న బాసలు కాళ్ల పారాణి ఆరకముందే చెరిగిపోతున్నాయి. అర్దాంతరంగా అక్రమ సంబంధాలకు తెగించి కట్టుకున్నోళ్లకు కన్నీళ్లు మిగులుస్తున్నారు. భర్తను భార్యలు, భార్యలను భర్తులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్న కేసులు అనేకం వెలుగులోకి వచ్చాయి. అలాంటి వీడియోలు సోషల్‌ మీడియాలో అనేకం వైరల్‌ అయ్యాయి. ప్రస్తుతం ఓ వీడియో నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. ఆ వీడియో చూసిన నెటిజన్స్‌ షాక్‌ అవుతున్నారు.

ఆ ఇంటిలో ఓ పాము దూరి అక్రమ సంబంధం గుట్టు రట్టు చేసింది. పాము కోసం మంచం మీద పరుపు ఎత్తి చూడగానే దాని కింద నక్కి పడుకున్న ఓ యువకుడు కలుగులో నక్కిన ఎలుకలా మెల్లిగా బటయపడ్డాడు. సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.

వీడియోలోని విజువల్స్‌ ప్రకారం కొందరు వ్యక్తులు చేతిలో కర్రలు పట్టుకుని హడావుడిగా ఓ ఇంట్లోకి పరిగెత్తారు. పాము కోసం వెతుకుతున్నట్లుగా ఇంట్లో అన్ని దిక్కులూ వెతికారు. ఆ తర్వాత అనుమానంతో మంచం కింద వెతికేందుకు వెళ్లారు. ఓ వ్యక్తి పరుపు కింద పాము దూరిందని అనుమానించి పరుపును పైకి ఎత్తుతారు. చివరకు పరుపు తీసి చూడగా.. దాని కింద షాకింగ్ సీన్ కనిపించింది.

వీడియో చూడండి:

మంచం కింద పాము ఉంటుందని అనుకుంటే ఓ వ్యక్తి పడుకుని ఉండడం చూసి అంతా ఆశ్చర్యపోయారు. తర్వాత అతన్ని బయటికి తీసి, వారి చేతిలోని కర్రలతో అతనికి దేహశుద్ది చేశారు. స్థానికులు గుమికూడి అతడిపై ఆగ్రహం వ్యక్తం చేయడం వీడియోలో కనిపిస్తుంది. వీడియో చూస్తుంటే.. భర్తకు తెలీకుండా తన ప్రియుడిని ఇంటికి పిలుపించుకున్న భార్య.. ఇలా మంచం కింద దాచినట్లు అర్థమవుతోందని నెటిజన్స్‌ పోస్టులు పెడుతున్నారు. ఇసొంటి వారి వల్లే సంసారాలు నాశనమవుతున్నాయి అంటూ కొందరు, వివాహేతర సంబంధాలు ఎన్నటికీ దాగవు అంటూ మరికొందరు పోస్టులు పెడుతున్నారు.