Viral Video: ప్రమాదకంగా ప్రవహిస్తున్న వాగు.. నవజాత శిశువు ప్రాణం కోసం ప్రాణాన్ని ఫణంగా పెట్టి వాగు దాటిన నర్స్.. వీడియో వైరల్

ఒక నర్సు ధైర్యసాహసాల వీడియో ఈ రోజుల్లో ప్రజలలో చర్చనీయాంశమవుతోంది. దీనిలో ఆమె తన ప్రాణాలను పణంగా పెట్టి నవజాత శిశువు ప్రాణాలను కాపాడటానికి ముందుకు వెళుతోంది. నన్ను నమ్మండి, ఈ నర్సును చూసిన తర్వాత.. మీరు కూడా ఒక క్షణం ఆశ్చర్యపోతారు. ఆమె విధి నిర్వహణ కోసం చేసిన పనికి సలామ్ అని అంటారు.

Viral Video: ప్రమాదకంగా ప్రవహిస్తున్న వాగు.. నవజాత శిశువు ప్రాణం కోసం ప్రాణాన్ని ఫణంగా పెట్టి వాగు దాటిన నర్స్.. వీడియో వైరల్
Viral Video

Updated on: Aug 24, 2025 | 11:14 AM

హిమాచల్ ప్రదేశ్‌లో వర్షాలు విధ్వంసం సృష్టిస్తున్నాయి. నదులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. ఇంతలో మండి జిల్లాలోని చౌహర్‌ఘాటి కి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ వీడియోలో ఒక స్టాఫ్ నర్సు కమల రాళ్లపై దూకి పొంగి ప్రవహించే వాగును దాటుతున్నట్లు కనిపిస్తుంది. ఇది చూసిన తర్వాత అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే ఆ మహిళ ఇలా దూకే సమయంలో చిన్న తప్పు జరిగినా ఆమె ప్రాణాలను బలిగొనేది. అయినప్పటికీ ఆమె తన పని చేయడానికి వెళుతుంది. రెండు నెలల శిశువుకు ఇంజెక్షన్ ఇవ్వడానికి తన ప్రాణాలను పణంగా పెట్టింది స్టాఫ్ నర్స్ .

ఒక వాగు అత్యంత వేగంతో ప్రవహిస్తున్నట్లు వీడియోలో చూడవచ్చు. ఎంత వేగంగా ప్రవహిస్తుందంటే.. వాటిలో ఏదైనా పడినా.. ఆ ప్రవాహానికి అడ్డుపడినా వాటిని ఈజీగా తమతో పాటు తీసుకుని వెళ్ళుతుంది. అటువంటి వాగు ని దాటేందుకు నర్సు నీటిలో ఉన్న బండ రాళ్లపై దూకుతూ.. జాగ్రత్తగా బ్యాలెన్స్ చేస్తూ ముందుకు కదులుతున్నట్లు కనిపిస్తుంది. స్టాఫ్ నర్సు కమల దూకి పొంగిపొర్లుతున్న కాలువను దాటుతున్నట్లు కనిపిస్తుంది.

ఇవి కూడా చదవండి

వీడియోను ఇక్కడ చూడండి

తన పోరాటం గురించి మాట్లాడుతూ.. తనకు సిహెచ్‌సి నుంచి అత్యవసరంగా ఫోన్ వచ్చిందని.. అక్కడికి తాను ప్రాణాలను కాపాడే మందులు ఎలాగైనా తీసుకేల్లాల్సి వచ్చిందని నర్సు చెప్పింది. నిరంతర భారీ వర్షాల కారణంగా.. ఆ ప్రాంతంలోని ఫుట్‌బ్రిడ్జి కొట్టుకుపోయింది. తన డ్యూటీ చేసే చోటకు చేరుకోవడానికి ఆమె రోజు పోరాటం చేయాల్సి వస్తోంది. నాలుగు కిలోమీటర్లు నడవాల్సి వస్తుంది.

ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయబడింది. ఇది ప్రజలకు చేరువైన వెంటనే వైరల్‌గా మారింది. అందరూ కమలని ప్రశంసించడం మొదలు పెట్టారు. ఆమె కృషికి తగిన ప్రతిఫలం పొందాలని చాలా మంది అంటున్నారు. అదే సమయంలో మన దేశానికి అలాంటి వ్యక్తుల అవసరం చాలా ఉందని మరొకరు రాశారు.

 

మరిన్ని వైరల్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..