Viral Video: ఈ ఉద్యోగానికి కావాలి గుండె ధైర్యం .. బల్బులు మార్చితే చాలు.. కోట్లలో జీతం..

|

Jun 13, 2023 | 7:21 AM

వందల మీటర్లు ఉండే ఎత్తైన సిగ్నల్ టవర్లపై పని చేయాలి. పైకి వెళ్లగానే కళ్లు తిరుగకుండా, ధైర్యంగా సన్నని కడ్డీలపై నుంచోవాల్సి ఉంటుంది. బయట కనిపించే టవర్ల లాంటివి కావు ఇవి. ఎత్తుకు పోయేకొద్దీ సన్నగా ఉంటాయి. చివరకు కేవలం సన్నని కడ్డీ మాత్రమే ఉంటుంది.

Viral Video: ఈ ఉద్యోగానికి కావాలి గుండె ధైర్యం ..  బల్బులు మార్చితే చాలు.. కోట్లలో జీతం..
Changind Bulb Job
Follow us on

కేవలం బల్బులను మార్చుతూ కోట్లు సంపాదించగలరా? ఏ సంస్థ అయినా లైట్లు మార్చితే కోట్ల రూపాయల జీతం ఇస్తుందా? అవును ఇస్తుంది. కేవలం టవర్‌కు ఉండే లైట్లను మార్చితే కోట్ల రూపాయల జీతం సంపాదించవచ్చు. కాకపోతే.. ఆ టవర్ల ఎత్తు మామూలుగా ఉండదు మరి..వందల మీటర్లు ఉండే ఎత్తైన సిగ్నల్ టవర్లపై పని చేయాలి. పైకి వెళ్లగానే కళ్లు తిరుగకుండా, ధైర్యంగా సన్నని కడ్డీలపై నుంచోవాల్సి ఉంటుంది. బయట కనిపించే టవర్ల లాంటివి కావు ఇవి. ఎత్తుకు పోయేకొద్దీ సన్నగా ఉంటాయి. చివరకు కేవలం సన్నని కడ్డీ మాత్రమే ఉంటుంది. ఈ టవర్లపై ఎక్కి లైట్లను మార్చాలి అంటే..భయంతో కూడిన పని. కేవలం ఒక తాడు మాత్రమే రక్షణగా ఉంటుంది. ఇలాంటి పనులు అందరూ చేయలేరు. ఇందుకు ప్రత్యేకంగా శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది. శారీరకంగా దృఢంగా ఉండాలి. ఇలాంటి టవర్లపై పనిచేయగలిగే వారికి చాలా డిమాండ్ ఉంది మరి.

Above the Sky

టవర్ ఎత్తు, అనుభవం, నైపుణ్యాన్ని బట్టి ఉద్యోగికి జీతం ఉంటుందట. కొందరికి గంటల చొప్పున ఉంటుంది. ఎంత తక్కువలో అయినా ఒక టవర్ ఎక్కి దిగడానికి కనీసం ఆరుగంటలైనా పడుతుంది. 1500 మీటర్ల టవర్‌ను ఎక్కగలిగేవారికి దాదాపు 1 కోటి రూపాయలపైనే ఉంటుంది. ఉద్యోగంలో కొత్తగా చేరినవారికే గంటకు సరాసరిగా 17 డాలర్ల వరకు ఇస్తారు. అయితే.. ప్రతీ ఆరునెలలకు ఒకసారి ఈ లైట్లను మారుస్తారట. అమెరికాలోని డకోటా నగరానికి చెందిన ఓ వీడియో వెలుగులోకి వచ్చింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..