CEAT టైర్స్ యజమాని హర్ష గోయెంకా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ X (గతంలో ట్విట్టర్)లో చాలా చురుకుగా ఉండే దేశంలోని పారిశ్రామికవేత్తలలో ఒకరు. గోయెంకా ఆసక్తికరమైన, సందేశాత్మక పోస్ట్‌లతో పాటు వీడియోలను తరచుగా షేర్ చేస్తారు. వీటి కోసం అతని ఫాలోవర్స్ మధ్య తరచుగా వార్తల్లో ఉంటాడు. ఇప్పుడు హర్ష షేర్ చేసిన ఓ వీడియో ద్వారా జపనీస్ సంస్కృతిని తెలియజేస్తూనే తన ప్రశంసలను తెలియజేయడానికి X సహాయం తీసుకున్నాడు. ఈ వీడియోకు సంబంధించిన నిజాలు తెలిస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు.
పారిశ్రామికవేత్త హర్షా గోయెంకాను జపాన్‌లోని యాపిల్ స్టోర్ కి సంబంధించిన వీడియో ఆకట్టుకుంది. స్టోర్ డిస్‌ప్లేలోని అన్ని ఐఫోన్‌లు యాంటీ-థెఫ్ట్ కోడ్‌లు లేకుండా ఉంచబడ్డాయన్న విషయాన్ని చూపిస్తుంది. ఫోన్ దొంగిలించబడుతుందని ఎవరూ ఆందోళన చెందరు. అయితే భారతదేశంతో సహా ఇతర దేశాల్లో ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లు యాంటీ-థెఫ్ట్ కోడ్‌లను ఏర్పాటు చేసి దొంగతనం నుంచి రక్షించుకుంటారు. కస్టమర్ వచ్చి చాలా హాయిగా ఐఫోన్ చేతిలోకి తీసుకుని చూడటం.. ఆ తర్వాత వాటిని ఎక్కడ నుంచి తీసుకున్నారో అక్కడే పెట్టడం వీడియోలో కనిపిస్తుంది. పారిశ్రామికవేత్త హర్ష ఈ వీడియో ద్వారా జపనీయులు ఎంత నిజాయితీగా ఉన్నారో చెప్పడానికి ప్రయత్నించారు.
Unlike in every country in the world iPhones in Apple stores in Japan are not tied (as they know that no one will steal it) – isn’t that the finest reflection of the culture of Japan? 👏👏👏 pic.twitter.com/EiFq9kJbt7
— Harsh Goenka (@hvgoenka) December 22, 2023
ప్రపంచంలోని అన్ని దేశాల మాదిరిగా జపాన్‌లోని ఆపిల్ స్టోర్‌ల్లో ఐఫోన్లకు యాంటీ-థెఫ్ట్ కోడ్ ని ఏర్పాటు చేసి డిస్ ప్లేలో పెట్టరు. ఎందుకంటే తమ ఫోన్లను ఎవరూ దొంగిలించరని ఆ షాప్ వారికి తెలుసు. అంటే ఇది జపనీస్ సంస్కృతికి గొప్ప ప్రతిబింబం కాదా అని క్యాప్షన్ ఇచ్చారు. ఈ పోస్ట్‌ను ఇప్పటివరకు 81 వేలకు పైగా వీక్షించగా.. చాలా మంది భిన్నమైన కామెంట్స్ చేశారు. ఈ వీడియో ప్రజలను షాక్‌కు గురి చేసింది.
ఒకరు ఇలా వ్రాశాడు ఇది నమ్మకం, గౌరవానికి సంబంధించింది. చాలా ఆకట్టుకునే ప్రతిబింబం! ఈ విషయాన్నీ ఐఫోన్‌ను ప్రదర్శించే విధానంలో కూడా ప్రతిబింభించేలా జపాన్ వాసులు తెలియజేశారు. మరికొందరు, ‘ప్రజలు నిజాయితీగా ఉన్నప్పుడు అది బలమైన సంబంధాలను ఏర్పరుస్తుంది’ అని వ్యాఖ్యానించారు. విశ్వసనీయతకు, నిజాయితీ అనేది జవాబుదారీతనం మరియు నైతిక ప్రవర్తనను ప్రోత్సహిస్తుంది కామెంట్ చేయగా.. జపాన్ వాసుల నిజాయతీ.. వారి సంస్కృతిని అభివృద్ధి చేసింది. నేను చూశానని వెల్లడించారు.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..