Viral Video: ఒకే వేదికపై ఇద్దరు కూతుర్లకు పెళ్లి చేసిన తల్లిదండ్రులు.. డిన్నర్ చేయాలంటే ఆధార్ చూపించమని అతిథులకు షాక్..

|

Sep 25, 2022 | 8:56 PM

డిన్నర్ చేసే సమయానికి అతిధులకు షాక్ ఇచ్చారు పెళ్లికూతురు ఫ్యామిలీకి సంబంధించిన వారు. విందు ఆరగించాలంటే.. తప్పని సరిగా ఆధార్ కార్డులను చూపించాలని కండిషన్ పెట్టారు. దీనికి కూడా ఓ రీజన్ చెప్పారు..

Viral Video: ఒకే వేదికపై ఇద్దరు కూతుర్లకు పెళ్లి చేసిన తల్లిదండ్రులు.. డిన్నర్ చేయాలంటే ఆధార్ చూపించమని అతిథులకు షాక్..
Wedding In Up
Follow us on

Viral Video: మీరు మీ జీవితంలో చాలా పెళ్లిళ్లకు వెళ్లి ఉండవచ్చు.. అయితే ఆ పెళ్లికి వెళ్లిన అతిధులను మీ గుర్తింపు కార్డుని చూపించమని ఎవరైనా ఎక్కడైనా అడిగిన సంఘటనలు ఉన్నాయా.. బహుశా కరోనా వెలుగులోకి వచ్చిన తర్వాత పెళ్లిళ్లు, ఫంక్షన్ల కు వెళ్లిన అతిధులను వ్యాక్సిన్ వేయించుకున్నారా అని అడిగి ఉండొచ్చు.. కానీ పెళ్లికి వెళ్లిన అతిధులను మీ ఆధార్ కార్డ్ చూపించండి.. అప్పుడే మీకు మా ఆతిధ్యం అన్నారు.. ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్ అవుతుంది. ఈ విచిత్ర ఘటన ఉత్తర్ ప్రదేశ్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లాలోని హసన్‌పూర్ ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఒకే వేదికపై పెళ్లి చెసుకున్నారు. ఈ వివాహ వేడుకకు భారీగా అతిథులు హజరయ్యారు. అయితే డిన్నర్ చేసే సమయానికి అతిధులకు షాక్ ఇచ్చారు పెళ్లికూతురు ఫ్యామిలీకి సంబంధించిన వారు. విందు ఆరగించాలంటే.. తప్పని సరిగా ఆధార్ కార్డులను చూపించాలని కండిషన్ పెట్టారు. దీనికి కూడా ఓ రీజన్ చెప్పారు.. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో ఓ రేంజ్ లో హల్ చల్ చేస్తోంది.

అతిథులు భారీ సంఖ్యలో హాజరుకావడాన్ని చూసిన పెళ్లి కూతురు ఫ్యామిలీ సభ్యులు భయపడ్డారు. ఎందుకంటే.. తాము అతిధుల కోసం ఏర్పాటు చేసిన ఆహారపదార్ధాలు సరిపోతాయాలేదా అని ఆలోచించారు. పెళ్ళికి వచ్చిన చాలా మంది అపరిచితులుగా కనిపించారు. దీంతో అతిథులను భోజన ప్రదేశంలోకి అనుమతించే ముందు వారి ఆధార్ కార్డులను చూపించమని అడగాలని నిర్ణయించుకున్నారు.

ఇవి కూడా చదవండి

In a seemingly bizarre incident, guests at a #wedding in Uttar Pradesh’s #Amroha district were asked to show their #Aadhaar cards before they were allowed to pick up dinner plates.

The incident took place in Hasanpur where two sisters were getting married at the same venue. pic.twitter.com/9IfenucXUH

— IANS (@ians_india) September 25, 2022

 

ఆధార్ కార్డు లేకుండా వచ్చిన చాలా మంది నిజమైన అతిథులు దీనిని అవమానంగా భావించి భోజనం చేయకుండా వేదిక నుండి బయలుదేరగా, ఆధార్ కార్డులు ఉన్న మరికొందరు లోపలికి వెళ్లి భోజనం చేశారు. కొందరు అతిథులు ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడంతో అది ఇప్పుడు వైరల్‌గా మారింది. ఇది కూడా చదవండి – ఉత్తరప్రదేశ్ దహన సంస్కారాలకు SOP లను జారీ చేస్తుంది: మృతదేహాలను రోడ్లపై ఉంచడం నిషేధించబడింది

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..