వావ్..! తనను కాపాడిన చిన్నారికి కృతజ్ఞతలు తెలిపిన ఏనుగు.. వీడియో చూసి ప్రశంసల వర్షం కురిపిస్తున్న నెటిజన్లు..

|

Oct 28, 2022 | 7:21 PM

ఈ వీడియోను ఐఎఫ్‌ఎస్ అధికారి సుశాంత నంద ట్విట్టర్‌లో షేర్ చేశారు. వీడియో చూసిన నెటిజన్లు భిన్నమైన కామెంట్స్‌ చేస్తున్నారు. చిన్నారిపై ప్రశంసల వర్షం కురిపిస్తూ..ఏనుగు కృతజ్ఞతను మెచ్చుకుంటున్నారు.

వావ్..! తనను కాపాడిన చిన్నారికి కృతజ్ఞతలు తెలిపిన ఏనుగు.. వీడియో చూసి ప్రశంసల వర్షం కురిపిస్తున్న నెటిజన్లు..
Elephant Stuck In Muddy
Follow us on

ఏనుగులు అసాధారణమైన తెలివైన జంతువులు. అనేక రకాల భావోద్వేగాలను కలిగి ఉంటాయి. ఏనుగులు ఎదుటివారిని అర్థం చేసుకోగలవు. వాటిని రెచ్చగొట్టకపోతే చాలా అరుదుగా మనుషులపై దాడి చేస్తాయి. మనతో స్నేహపూర్వకంగా, ఉల్లాసభరితమైన సంబంధాన్ని పంచుకుంటాయి.. ఇటీవల బురదలో పడిన ఒక బాలిక సహాయం కోరిన ఒక పిల్ల ఏనుగు ఇంటర్నెట్‌ను కదిలించేస్తుంది. ఇందుకు సంబంధించి ట్విటర్‌లో పోస్ట్‌ చేసిన ఈ వీడియోలో ఏనుగు పిల్ల ఒక గ్రామీణ రహదారి, చెరకు పొలానికి మధ్య ఉన్న బురద గుంటలో చిక్కుకుపోయినట్లుగా మనం వీడియోలో చూడొచ్చు. అదృష్టవశాత్తూ.. ఒక అమ్మాయి దానిని రక్షించడానికి వచ్చింది. దానిని గుంటలో నుండి బయటకు తీయడానికి తన శాయశక్తులా ప్రయత్నించింది. అమ్మాయి ఏనుగు కాళ్లను గుంటలోంచి బయటకు తీసి చివరకు గజరాజును బయటకు తీయడంలో సఫలమైంది. ఏనుగు బురదలో నుండి బయటపడిన తరువాత ఆ మూగజీవి ఆ బాలికకు కృతజ్ఞతలు చెబుతున్నట్లుగా దాని తొండాన్ని అమ్మాయి వైపుకు ఎత్తి థ్యాంక్స్‌ చెబుతున్నట్టుగా చేసింది.

ఈ వీడియోను ఐఎఫ్‌ఎస్ అధికారి సుశాంత నంద ట్విట్టర్‌లో షేర్ చేశారు. క్యాప్షన్ ఇలా రాశారు..బురదలో కూరుకుపోయిన ఏనుగు పిల్ల బయటకు రావడానికి ఆమె సహాయం చేసింది. దాంతో ఆ బాలికకు ఆ గజరాజు కృతజ్ఞతలు చెబుతున్నట్టుగా ఆశీర్వాదం చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్‌ అవుతోంది.

ఇవి కూడా చదవండి

వీడియో చూసిన నెటిజన్లు భిన్నమైన కామెంట్స్‌ చేస్తున్నారు. జీవితంలో ఎవరికైనా కావలసిందల్లా కొంచెం ప్రోత్సాహం, చేయూత అంతే దాంతో ఎంతటి కష్టానైనా ఈజీగా చేధించేస్తారు అంటూ ఒక నెటిజన్‌ కామెంట్ చేయగా, . వావ్! ఇది చాలా గొప్ప పని అంటూ మరో నెటిజన్‌ కామెంట్‌ పెట్టారు. ఇటువంటి దయగల మనుషుల వల్లే ప్రపంచం అభివృద్ధి చెందుతుందంటూ మరో నెటిజన్‌ ట్విట్‌ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి