పిల్లల పుట్టినరోజులకు తల్లిదండ్రులు సర్‌ప్రైజ్‌డ్ గిఫ్ట్స్ ఇవ్వడం చూస్తుంటాం. పిల్లల ఆనందం కోసం కేక్‌లను కూడా వెరైటీగా తయారుచేయిస్తూ ఉంటారు. బొమ్మల కేకులు లేదంటే అనేక రకాల డిజైన్లతో కేక్‌లను తయారుచేయిస్తూ ఉంటారు. మరికొన్ని సార్లు స్నేహితులు లేదా మనతో క్లోజ్‌గా ఉండే సన్నిహితులను అప్పుడప్పుడు సర్‌ఫ్రైజ్ చేస్తూ ఉంటాం. అలాంటి సందర్భాలు తప్పకుండా మనల్ని ఎంతో సంతోషానికి గురిచేస్తాయి. తాజాగా తమ కుమార్తె పుట్టినరోజు సందర్భంగా అమ్మాయిని సర్‌ప్రైజ్ చేయడానికి ప్లాన్ చేశారు తల్లిదండ్రులు. ఆ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో ప్రారంభంలో కుమార్తె కళ్లను మూస్తారు. ఆ తర్వాత ఓ మహిళ కేక్ తీసుకొచ్చి టేబుల్ మీద పెడతారు. నెమ్మదిగా కుమార్తె కళ్లను తెరుస్తారు. అంతే ఆ కేక్ చూడగానే ఆ బర్త్‌డే గర్ల్ ఆనందానికి అవధుల్లేవు. ఎందుకంటే తాను ఎంతో ఇష్టపడే దక్షిణ కొరియాకు చెందిన బీటిఎస్ బాయ్ బ్యాండ్ చిత్రం కేక్ పై ఉంది. అది చూసి ఆ అమ్మాయి ఎంతో ఉద్వేగానికి లోనైన దృశ్యం వీడియోలో కనిపిస్తోంది.
కొరియన్ డ్రామాలు, కొరియన్ సాంగ్స్ కు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులున్నారు. కే పాప్స్ గా క్రేజ్ సొంతం చేసుకున్న బ్యాండ్స్ అనేకం ఉన్నాయి. అయితే వీటిల్లో బిటిఎస్‌కు ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. కొరియన్ మ్యూజిక్ బ్యాండ్ బీటిఎస్ ప్రపంచంలోనే అత్యంత ప్రజాధారణ పొందిన అతిపెద్ద మ్యూజిక్ బ్యాండ్. బిటిఎస్(“బియాండ్ ది సీన్” కోసం) అని పిలువబడే బాయ్ బ్యాండ్ కు ప్రపంచవ్యాప్తంగా ఓ రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది.
ఈ నేపథ్యంలో బిటిఎస్ అభిమాని అయిన తమ కుమార్తె బర్త్‌డే సందర్భంగా ఆ పేరెంట్స్ బిటిఎస్ బాయ్ బ్యాండ్ చిత్రంతో తయారుచేసిన కేక్‌తో సర్‌ప్రైజ్ చేశారు. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేసినప్పటి నుంచి లక్షలాది మంది వీక్షించడంతో పాటు రెండు లక్షల కంటే ఎక్కువ మంది లైక్స్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ.. ఆమెను అర్థం చేసుకునే వ్యక్తులను కలిగి ఉండటం అదృష్టం అని కామెంట్స్ చేస్తున్నారు. మరికొంతమంది అయితే తన దగ్గర ఆ కేక్ ఉంటే ఎప్పటికి కట్ చేయబోనంటూ వ్యాఖ్యలు పోస్టు చేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం చూడండి..