Viral Video: కట్టెల పొయ్యమీద ప్లాస్టిక్‌ కవర్లో చేపల పులుసు వండి బామ్మ.. వీడియో చూసి షాక్ తింటున్న నెటిజన్లు

|

Feb 25, 2023 | 12:25 PM

ఓ పెద్దావిడ ఓ ప్లాస్టిక్‌ కవర్లో మూడొంతులు నీళ్లు నింపి దానిని కర్రకు  తగిలించి పొయ్యికి ఇరువైపుల ఉన్నకట్టెలపైన ఉంచింది. కవరు ఇప్పడు సరిగ్గా పొయ్యిమీద ఉంది.

Viral Video: కట్టెల పొయ్యమీద ప్లాస్టిక్‌ కవర్లో చేపల పులుసు వండి బామ్మ.. వీడియో చూసి షాక్ తింటున్న నెటిజన్లు
Fish Curry Cooking In Plastick Cover
Follow us on

ఇదేంటి ప్రపంచమంతా ప్లాస్టిక్‌ నిషేధించమంటుంటే.. మీరేమో ప్లాస్టిక్‌ కవర్లో వండిన చేపల పుసులు యమరుచిలే అంటున్నారు.. అనుకుంటున్నారా.. నిజమే ప్లాస్టిక్‌ ప్రాణానికి హాని కలిగిస్తుంది. కానీ ఇంటర్నెట్‌ వినియోగం పెరిగిన తర్వాత చాలామంది సోషల్‌ మీడియాలో పాపులర్‌ అయ్యేందుకు రకరకాల ప్రయోగాలు చేస్తూ.. అందుకు సంబంధించిన వీడియోలను నెట్టింట షేర్‌ చేస్తున్నారు. అలాంటి బాపతే ఇది కూడా. అవును ఓ పెద్దావిడ ప్లాస్టిక్‌ కవర్లో కట్టెల పొయ్యిమీద చేపల పులుసు వండింది. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఓ పెద్దావిడ కట్టెల పొయ్యి ముందు కూర్చుని ఉంది. ఆ పొయ్యికి ఇరు వైపుల రెండు కట్టెలు పాతిపెట్టి ఉన్నాయి. ఓ  పెద్దావిడ ఓ ప్లాస్టిక్‌ కవర్లో మూడొంతులు నీళ్లు నింపి దానిని కర్రకు  తగిలించి పొయ్యికి ఇరువైపుల ఉన్నకట్టెలపైన ఉంచింది. కవరు ఇప్పడు సరిగ్గా పొయ్యిమీద ఉంది. ఇప్పుడు కవర్లోని నీటిలో చేపల పులుసుకు కావలసిన పదార్ధాలన్నీ వేసింది. అలాగే పక్కనే ఓ మట్టి కుండలో ఉన్న చేపను యధావిధిగా అందులో వేసింది. తర్వాత సాల్ట్‌ వేసింది. ఒక్కడే ఉన్న ఓ తులసి మొక్కలాంటి ఓ ఎండిన కొమ్మను గరిటెలా చేసుకుని దాంతో ఆ చేపల పులుసును కలిపింది. క‌ట్టెల మంటపై వంట పాత్ర లేదా కుండ‌లో కాకుండా ప్లాస్టిక్ క‌వ‌ర్‌లో ఆ పెద్దావిడ చేప‌ల పులుసు వండిన తీరు నెటిజ‌న్లలో ప‌లు ప్రశ్నలు రేకెత్తించింది.

ఇవి కూడా చదవండి

ది ఫైజెజ్ ట్విట్టర్ ఖాతాలో ఈ వీడియోను షేర్ చేశారు. ఇప్పటికే ఈ వీడియోను 5 ల‌క్షల మందిపైగా వీక్షించారు. అయితే మంట వేడికి ఆ బ్యాగ్ వెంట‌నే క‌రిగిపోతుంద‌ని ఎవ‌రైనా అనుకోవ‌చ్చు. కానీ, ఆ ప్లాస్టిక్ బ్యాగ్ అంత‌టి హీట్‌కూ త‌ట్టుకుని ఉండ‌టం విశేషం. కాగా ఈ వీడియోపై నెటిజన్లు భిన్న రకాలుగా స్పందించారు. ప్లాస్టిక్‌తో కుకింగ్ క్యాన్సర్ ముప్పు పెంచుతుంద‌ని ప‌లువురు యూజ‌ర్లు ఆందోళ‌న వ్యక్తం చేశారు. మంట త‌గిలితే ప్లాస్టిక్ క‌రిగిపోతుంద‌ని అస‌లు ఇది సాధ్యమా అని మ‌రికొంద‌రు యూజ‌ర్లు ప్రశ్నించారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..