ప్రేమంటే ఇదేరా.. అందమైన సాయంత్రం వేళ.. వృద్ధ జంట ఫోటోషుట్‌..! వీడియో చూస్తే ఫిదా అవ్వాల్సిందే.

|

Dec 17, 2024 | 10:40 AM

సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియోను 11 లక్షల మందికి పైగా వీక్షించారు. వేలాది మంది దీన్ని లైక్ చేశారు. కొన్ని కామెంట్లకు కూడా వెయ్యికి పైగా లైక్‌లు వచ్చాయి. సామాన్య ప్రజలే కాకుండా సినిమా హీరోయిన్లు, హీరోలు కూడా ఈ పోస్ట్ పై స్పందించారు. లైకులు, షేర్లు చేస్తూ మరింత వైరల్ గా మార్చేశారు.

ప్రేమంటే ఇదేరా.. అందమైన సాయంత్రం వేళ.. వృద్ధ జంట ఫోటోషుట్‌..! వీడియో చూస్తే ఫిదా అవ్వాల్సిందే.
Elderly Man Clicks Wife Pho
Follow us on

తమ ఆత్మీయుల కోసం వృద్ధులు ప్రాణత్యాగం చేసిన వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో చాలానే వైరల్‌గా మారాయి. జీవిత భాగస్వామిపై ప్రేమను వ్యక్తపరిచే పెద్దలు చేసే చర్యలను కొత్త తరానికి చూపించడానికి సోషల్ మీడియా కూడా ఉపయోగపడుతోంది. సోషల్ మీడియా వినియోగదారులు కూడా పాత తరం ప్రేమను చూసి నేర్చుకోవాలని భావిస్తారు. అలాంటి పాత తరం ప్రేమను చూపించే వీడియో ఒకటి సోషల్ మీడియాలో షేర్ చేయగా, దాన్ని 1 కోటి 12 లక్షల మందికి పైగా వీక్షించారు.

వాట్ షీ డూ అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీ ద్వారా ఈ వీడియోను ఇంటర్‌నెట్‌లో షేర్ చేయగా అది విపరీతంగా వైరల్‌గా మారింది. దానికి క్యాప్షన్‌గా ఇవి నాకు కావాల్సిన క్షణాలు అని రాశారు. అంతేకాకుండా, ఇది మానవ ప్రాథమిక అవసరం అని కూడా వీడియోలో వ్రాయబడింది. ఇకపోతే, ఈ వీడియోలో ప్రత్యేకంగా ఏమీ లేదు, ఇది సింగిల్ షాట్ వీడియో. మధ్యలో కేవలం పానింగ్ ఉంది. ఓ అందమైన సాయంత్రం వేళ ఒక వృద్ధజంట ఫోటో షూట్‌ ఇది.

ఇవి కూడా చదవండి

అది ఒక పెద్ద గడ్డి మైదానంలో గోడ దగ్గర, నీలిరంగు చీరలో ఒక వృద్ధ మహిళ సాయంత్రం సూర్యకాంతిలో నిలబడి ఉంది. వారి ముందు, కెమెరా బ్యాగ్‌తో ఒక వృద్ధుడు నేలపై కూర్చుని ఆమెను ఫోటో తీస్తున్నాడు. అతడు తన భార్యను SLR కెమెరాతో ఫోటో తీస్తున్నాడు. కాసేపయ్యాక వయసు బలహీనతను చూపిస్తూ తన రెండు చేతులను మోకాళ్లపై ఉంచి లేవడానికి ప్రయత్నిస్తాడు.. ఇంతటితో వీడియో ముగుస్తుంది.

సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియోను 11 లక్షల మందికి పైగా వీక్షించారు. వేలాది మంది దీన్ని లైక్ చేశారు. కొన్ని కామెంట్లకు కూడా వెయ్యికి పైగా లైక్‌లు వచ్చాయి. సామాన్య ప్రజలే కాకుండా నటి కృష్ణ ముఖర్జీ, షిబానీ బేడీ, రిద్ధిమా పండిట్, రోడీస్ ఫేమ్ ఆరుషి దత్తా, కొరియోగ్రాఫర్ తుషార్ కలియా వంటి ప్రముఖులు కూడా తమ ప్రేమను తెలియజేసేందుకు కామెంట్ బాక్స్‌లో రాశారు. ఇది ఇంటర్నెట్‌లో అత్యుత్తమ రీల్ అని ఒకరు రాయగా, నా తల్లితండ్రులు కూడా ఇలాగే ఉన్నారని మరోకరు రాశారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి