
హైదరాబాద్ లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒళ్లు గగుర్పొడిచే సంఘటన జరిగింది. మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ హైవే నుంచి కిందికి దూకేశాడు. పిల్లర్ నంబర్ 100 పై నుండి తాగిన మత్తులో కిందికి దూకాడు. అయితే మధ్యలో వైరు తట్టుకోవడంతో కాసేపు అక్కడే వేలాడుతూ ఉండిపోయాడు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది.
వైరుకు వ్యక్తి వేలాడుతున్న దృశ్యాన్ని స్థానికులు గమనించడంతో పెద్ద ఎత్తున అక్కడ జనం గుమిగూడారు. ఆ వ్యక్తిని కాపాడేందుకు శాయశక్తులా ప్రయత్నించారు. చివరికి తమ కారులో నుండి కారు కవర్ను తీసుకొని నలుగురి సహాయంతో కింద తెరిచి పట్టుకున్నారు. సదరు వ్యక్తి ఆ కారు పై పడటంతో ప్రమాదం తప్పింది. కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆవ్యక్తి ఎవరు? ఎందుకు దూకాల్సి వచ్చిందనే దానిపై పోలీసులు విచారణ చేపట్టారు.
పీవీ ఎక్స్‌ప్రెస్ హైవే పైన వైరుకు వ్యక్తి వేలాడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వైరు లేకుంటే తాగుబోతు ప్రాణాలు గాల్లో కలిసిపోయి ఉండేవని, ఓ టకుంబం వీధిన పడేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
A Drunk man narrowly escaped death after falling from the PVNR Expressway at Attapur @TheSiasatDaily #Hyderabad pic.twitter.com/ruiDXkRe3v
— Mohammed Baleegh (@MohammedBaleeg2) April 21, 2025