AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: చుక్కేసి.. స్కూల్‌లో చిందేశాడు.. కట్‌చేస్తే.. ఉద్యోగం ఊడి ఇంట్లో కూర్చున్నాడు!

పిల్లకు విద్యాబుద్దులు నేర్పించాల్సిన గురువే మతితప్పి వారితో అనుచితంగా ప్రవర్తించాడు. రోజూ స్కూల్‌కు తాగి వస్తూ, సెల్‌ఫోన్‌లో పాటలు పెట్టి విద్యార్థులతో డ్యాన్స్‌లు చేస్తూ వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో ఉన్నతాధికారులు అతన్ని సస్పెండ్‌ చేశారు. ఈ ఘటన చత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో వెలుగు చూసింది.

Viral Video: చుక్కేసి.. స్కూల్‌లో చిందేశాడు.. కట్‌చేస్తే.. ఉద్యోగం ఊడి ఇంట్లో కూర్చున్నాడు!
Drunkteacher
Anand T
|

Updated on: Jul 04, 2025 | 7:48 PM

Share

పిల్లకు విద్యాబుద్దులు నేర్పించాల్సిన గురువే మతితప్పి వారితో అనుచితంగా ప్రవర్తించాడు. రోజూ స్కూల్‌కు తాగి వస్తూ, సెల్‌ఫోన్‌లో పాటలు పెట్టి విద్యార్థులతో డ్యాన్స్‌లు చేస్తూ వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. విషయం తెలుసుకున్న అధికారులు అతన్ని సస్పెండ్ చేశారు. వివరాల్లోకి వెళితే, బలరాంపూర్ జిల్లా వాడ్రాఫ్‌నగర్ పరిధిలోని పశుపతిపూర్ ప్రాథమిక పాఠశాలలో లక్ష్మీ నారాయణ్ సింగ్ అనే వ్యక్తి ప్రధానోపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే మద్యానికి బానిసైన ఇతను తరచూ తాగి వచ్చి విద్యార్థులను ఇబ్బందులకు గురిచేసేవాడు. ఇటీవల ఒక రోజు తాగి వచ్చి తన మొబైల్ ఫోన్‌లో పాటలు పెట్టి, విద్యార్థినులతో కలిసి అనుచితంగా డ్యాన్స్ చేశాడు.

దీన్ని గమనించిన స్కూల్‌లో పనిచేస్తున్న ఓ సిబ్బంది అతను విద్యార్థులతో డ్యాన్స్‌ చేస్తున్న దృశ్యాలను వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో వీడియో కాస్తా వైరల్‌గా మారి ఉన్నతాధికారుల దృష్టికి చేరింది. ఎలాగో ఉపాధ్యాయుడి బండారం బయటపడడంతో అతని చేసే అడగాలను విద్యార్థులు అధికారులకు వివరించారు. లక్ష్మీ నారాయణ్ సింగ్ రోజూ తాగి వస్తూ తమను ఇబ్బందులకు గురిచేసేవాడని ఆరోపించారు.

వీడియో చూడండి..

ఇక ఈ ఘటనపై స్పందించిన విద్యాశాఖ అధికారి (డీఈవో) డీఎన్ మిశ్రా ప్రధానోపాధ్యాయుడు లక్ష్మీ నారాయణ్ సింగ్‌పై చర్యలు తీసుకున్నాడు. అతన్ని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఘటనపై స్థానిక ఎమ్మెల్యే శకుంతల పోర్టే కూడా స్పందించారు. నారాయణ్‌ సింగ్‌ తీరుపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇలాంటి నీచమైన పనులు చేసినందుకు ఉపాధ్యాయుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పొగాకు అలవాటు లేకపోయినా.. వీరికి నోటి క్యాన్సర్ పక్కా!
పొగాకు అలవాటు లేకపోయినా.. వీరికి నోటి క్యాన్సర్ పక్కా!
నావికా స్థావరానికి.. చైనా జీపీఎస్ ట్రాకర్‌ ఉన్న గూఢాచార పక్షి
నావికా స్థావరానికి.. చైనా జీపీఎస్ ట్రాకర్‌ ఉన్న గూఢాచార పక్షి
సినిమాలు హిట్టు.. అయినా సర్జరీ కోసం బలవంతం చేశారు..
సినిమాలు హిట్టు.. అయినా సర్జరీ కోసం బలవంతం చేశారు..
ఈ వాస్తు సూత్రాలు పాటించారంటే.. మీ జీతానికి రెక్కలు వచ్చినట్టే..
ఈ వాస్తు సూత్రాలు పాటించారంటే.. మీ జీతానికి రెక్కలు వచ్చినట్టే..
హైవేపై 100కి.మీ స్పీడ్‌లో ఉన్న కారు బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయా?ఎలా?
హైవేపై 100కి.మీ స్పీడ్‌లో ఉన్న కారు బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయా?ఎలా?
ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..
ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..
సుభాష్‌ చంద్రబోస్‌ ప్రయాణించిన రైలు ఇప్పుడు ఎక్కడ నడుస్తుంది?
సుభాష్‌ చంద్రబోస్‌ ప్రయాణించిన రైలు ఇప్పుడు ఎక్కడ నడుస్తుంది?
రోజూ ఇవి రెండు తింటే చాలు.. లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు..
రోజూ ఇవి రెండు తింటే చాలు.. లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు..
టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ ఫైనల్ నేడే..ఈ 5 కీలక అంశాలపైనే అందరిచూపు
టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ ఫైనల్ నేడే..ఈ 5 కీలక అంశాలపైనే అందరిచూపు
ఉదయం Vs రాత్రి.. స్నానం చేయడానికి బెస్ట్ టైమ్ ఏదీ..?
ఉదయం Vs రాత్రి.. స్నానం చేయడానికి బెస్ట్ టైమ్ ఏదీ..?