Viral Video: పియానో వాయిస్తూ.. గొంతు సవరించుకున్న కుక్క.. సంగీత కచేరీకి టికెట్లు మొత్తం కొనేస్తా అంటున్న నెటిజన్

|

Mar 17, 2022 | 7:13 PM

Viral Video: కుక్కలు విశ్వాసం గల జంతువులు. మానవులకు కుక్కలు వినోదాన్ని ఇస్తాయి. వాటితో కొంత సమయం గడిపితే చాలు.. మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఒకొక్కసారి కుక్కలు మనుషులతో సమానంగా పనులు చేస్తూ..

Viral Video: పియానో వాయిస్తూ.. గొంతు సవరించుకున్న కుక్క.. సంగీత కచేరీకి టికెట్లు మొత్తం కొనేస్తా అంటున్న నెటిజన్
Viral Video
Follow us on

Viral Video: కుక్కలు విశ్వాసం గల జంతువులు. మానవులకు కుక్కలు వినోదాన్ని ఇస్తాయి. వాటితో కొంత సమయం గడిపితే చాలు.. మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఒకొక్కసారి కుక్కలు మనుషులతో సమానంగా పనులు చేస్తూ అలరిస్తుంటాయి. అటువంటి వీడియోలు ఆనందాన్ని(Funny Video) ఇస్తాయి. తాజాగా ఓ వీడియో నెటిజన్లను అలరిస్తుంది. ఈ  వీడియోలో ఒక కుక్క.. గొప్ప సంగీతకళాకారుడిగా పియానో(Piano) ను ప్లే చేస్తుంది. అంతేకాదు.. ఆ కుక్క పియానో ​​మెట్లపై సాంగ్ ను ప్లే చేయడమే కాదు.. అది నోట్స్‌ కి అనుగుణంగా గొంతు సవరించుకుంది.. పాడటానికి ప్రయత్నించింది. ప్రస్తుతం   dogsofinstagram లో షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం నెటిజన్లను ఓ రేంజ్ లో అలరిస్తుంది.

ఈ వీడియోలో కుక్క తన వెనక కాళ్లపై నుల్చుని.. పియానోపై  మెట్లను ముందు కాళ్లతో సంగీతాన్ని వాయిస్తుంది. ఇలా పియానోని ప్లే చేస్తూ.. సంగీతాన్ని కూడా ఆలపిస్తుంది. “నా కుక్కకి పియానో వాయించడం చాలా ఇష్టం.. సంగీతం పాడడం ఇంకా ఇష్టం” అని నవ్వుతున్న ఎమోజీతో ఉన్న టెక్స్ట్ వీడియోపై ఉంది. బడ్డీ..  సంగీతాన్ని అనుభూతి చెందండి” అని వీడియోకి క్యాప్షన్ జతచేశారు.

ఈ వీడియో 50,000 కంటే ఎక్కువ లైక్‌లను సొంతం చేసుకుంది. కుక్కలను అవి చేసే పనులను ఇష్టపడే  నెటిజన్లను ఈ వీడియో అమితంగా ఆకట్టుకుంది. “ఈ ప్రతిభావంతురాలైన కళాకారుడి సంవత్సర కచేరీ టిక్కెట్లను మొత్తం నేను కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నాను.” ఒక నెటిజన్ వ్యాఖ్యానించాడు. “ఓహ్ మై గుడ్నెస్ .. కుక్క సంగీతం వినసొంపుగా ఉంది  అని వ్యాఖ్యానించాడు.  ”కుక్క ఇంటి సంగీతకారుడు అయిన ఆ క్షణం అంటూ మరొకరు కామెంట్ చేశాడు.  ఈ వీడియోని మొదట సంగీతకారుడు అయిన జోష్ మెకే అనే వ్యక్తి తన వ్యక్తిగత ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు.

Also Read:

TS SSC Exams: తెలంగాణాలో పరీక్షల తేదీలపై అభ్యంతరాలు.. టెన్త్ ఎగ్జామ్ డేట్స్ మార్చాలని టీపీఏ డిమాండ్

Jayalalitha: జయలలిత, శోభన్ బాబు నా తల్లిదండ్రులు.. నాకు వారసత్వ ధ్రువపత్రం ఇవ్వండి