Viral Video: గడ్డకట్టే నదిలో చిక్కుకున్న కుక్క.. ప్రాణాలు పోయేముందు కాపాడిన పోలీసులు.. వైరల్‌ వీడియో..

|

Mar 07, 2022 | 10:11 AM

Viral Video: సోషల్‌మీడియాలో ప్రతిరోజు చాలా వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. అందులో చాలా రకాల వీడియోలు ఉంటాయి. కొన్ని భయంకర వీడియోలు ఉంటే మరికొన్ని

Viral Video: గడ్డకట్టే నదిలో చిక్కుకున్న కుక్క.. ప్రాణాలు పోయేముందు కాపాడిన పోలీసులు.. వైరల్‌ వీడియో..
Police Rescued
Follow us on

Viral Video: సోషల్‌మీడియాలో ప్రతిరోజు చాలా వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. అందులో చాలా రకాల వీడియోలు ఉంటాయి. కొన్ని భయంకర వీడియోలు ఉంటే మరికొన్ని హాస్యానికి సంబంధించి ఉంటాయి. కొన్ని ఆసక్తిని కలిగి ఉంటే మరికొన్ని ఉత్కంఠని కలిగి ఉంటాయి. ఇంకొన్ని చమత్కార వీడియోలు ఉంటాయి. అన్నిటికన్నా జంతువుల వీడియోలని నెటిజన్లు బాగా ఆదరిస్తారు. పదే పదే చూస్తూ లైక్స్, షేర్స్‌ చేస్తారు. అందుకే ఈ వీడియోలు సోషల్‌మీడియాలో ఎక్కువగా వైరల్‌ అవుతుంటాయి. తాజాగా మంచులో చిక్కుకున్న ఒక కుక్కపిల్ల వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు తెగ స్పందిస్తున్నారు. అసలు ఆ వీడియోలో ఏముందో మనం తెలుసుకుందాం. కష్టల్లో చిక్కుకున్న జంతువులని చూస్తే ఎవ్వరికైనా పాపం అనిపిస్తుంది. ఈ వీడియోలో కూడా ఓ కుక్క మిచిగాన్‌లోని గడ్డకట్టిన డెట్రాయిట్ నదిపై చిక్కుకుంటుంది. ఒక మంచు ముక్కపై గడ్డ కట్టే స్థితిలో ఉంటుంది. చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంటుంది. ఇలాగే మరో గంటలో చనిపోయే అవకాశం ఉంది.

సరిగ్గా అదే సమయంలో దాని పరిస్థితిని చూసిన కొందరు లేక్‌ పోలీసులకి సమాచారం అందిస్తారు. వారు వెంటనే రెస్క్యూ ఆపరేషన్ మొదలుపెడుతారు. గడ్డకట్టే నదిలో దిగి కుక్కని నెమ్మదిగా బయటకి తీసుకొస్తారు. దీంతో అది ఊపిరి పీల్చుకుంటుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు, జంతు ప్రేమికులు రెస్క్యూటీం మెంబర్స్‌ని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. వారు చేసిన పనికి హ్యాట్సాప్‌ చెబుతున్నారు. పోలీస్ డిపార్ట్‌మెంట్‌లోని రెస్క్యూ టీమ్ గడ్డకట్టే నది నుండి కుక్కను తిరిగి తీసుకువస్తుంది. ప్రస్తుతం, ఈ వీడియో మరింత వైరల్ అవుతోంది, ఇది వార్తలు రాసే సమయానికి దాదాపు లక్షల వ్యూస్‌తో పెద్ద సంఖ్యలో లైక్‌లను పొందింది. మిచిగాన్‌లోని వైండోట్ పోలీసులను అందరూ అభినందిస్తున్నారు. ఇప్పటివరకు ఈ వీడియోని లక్షమందికి పైగా చూశారు. లైక్స్‌, కామెంట్స్ చేశారు. మీరు కూడా ఈ వీడియోని చూసినట్లయితే మీ అభిప్రాయాన్ని షేర్ చేసుకోండి.

Aloe Vera: ఆ సమస్యతో బాధపడితే కలబంద వాడండి.. తక్షణమే ఉపశమనం..

Maruti Suzuki: మారుతి సుజుకి బంపర్ ఆఫర్.. వ్యాగనర్ నుంచి ఆల్టో వరకు రూ.40,000 తగ్గింపు..

ఈ పథకంలో నెలకి రూ.3000 పొదుపు చేస్తే చాలు.. 15 లక్షల నిధి మీ సొంతం..!