
ఇంటర్నెట్ ప్రపంచంలో జంతువులకు సంబంధించిన వీడియోలు ప్రతిరోజూ వైరల్ అవుతూనే ఉంటాయి. జంతువులకు సంబంధించిన వీడియోలను మిగతా వాటి కంటే ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ప్రస్తుతం నెట్టింట్లో చాలా వీడియోలు సందడి చేస్తూనే ఉంటాయి. వీటిని చూడటమే భారీగా షేర్ చేస్తారు కూడా.. ముఖ్యంగా కుక్కలకు చెందిన వీడియో అయితే మరింతగా ఆకట్టుకుంటాయి. పెంపుడు జంతువుల ప్రేమికులు కుక్కలకు సంబంధించిన వీడియోలను చూడడమే కాదు విపరీతంగా షేర్ చేస్తారు. అలాంటి వీడియో ఒకటి ఇప్పుడు నెటిజన్లను ఆకట్టుకుంటుంది. ఈ వీడియో చూసిన తర్వాత మీరు కూడా వావ్ అంటారు.
కుక్కలను అత్యంత తెలివైన జంతువులు అని పిలుస్తారు. తమ తెలివితేటలను, సామర్థ్యాన్ని చాలాసార్లు నిరూపించుకున్నాయి. యజమాని పట్ల విధేయత, నిజాయితీ, తమ యజమాని కోసం తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టడం వంటి విషయాల్లో కుక్కలు ఎల్లప్పుడూ నంబర్ వన్ జంతువులే అని చెప్పవచ్చు. అయితే కుక్కలు తమ శేష్ఠలతో వినోదాన్ని పండిస్తాయి. తాజాగా దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
Very little is needed to make a happy life;
It is all within yourself, in your way of thinking.Marcus Aurelius pic.twitter.com/S97cnfybXQ
— Ramblings (@ramblingsloa) September 10, 2023
ఓ కుక్క నోటిలో బంతిని పట్టుకుని ఎంతో చురుకుదనంతో రోడ్డు మీద వస్తూ కాలువ మీద ఉన్న వంతెన మీద నుంచి కిందకు పడేసింది. వెంటనే జెట్ స్పీడ్ తో పరిగెడుతూ ఆ బంతిని పట్టుకోవడానికి రోడ్డుమీద నుంచి కిందకు దిగి కాలవలో దిగి ఈదుకుంటూ బంతిని అందుకుంది. మళ్ళీ ఆ బంతిని తీసుకుని కుక్క వంతెన దగ్గరకు వచ్చి కాలవలోకి విసిరింది. మళ్ళీ వెంటనే దానిని తీసుకోవడానికి పరిగెత్తింది. కుక్క ఫన్నీ ఆటను చూస్తే ఎవరికైనా తమ బాల్యం గుర్తుకు రాక మానదు ఎవరికైనా..
ఈ వీడియోను @ramblingsloa అనే ఖాతా ద్వారా ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేసారు. ఈ వీడియో 42 వేలకి పైగా వ్యూస్ ను సొంతం చేసుకోగా భిన్నమైన కామెంట్స్ చేస్తూనే ఉన్నారు.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..