Roller Viral: పడవ ఊగిపోయింది.. రోలర్ నీటిపాలయ్యింది.! వైరల్ అవుతున్న వీడియో
సోషల్ మీడియాలో రోజూ అనేక వీడియోలో వైరల్ అవుతూ ఉంటాయి. వాటిలో కొన్ని ఆలోచింపచేస్తే, కొన్ని ఆందోళన కలిగిస్తాయి. మరికొన్ని స్పూర్తిని నింపుతాయి. తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఇందులో కొందరు వ్యక్తులు ఓ స్టీమ్ రోలర్‌ను పడవలోకి ఎక్కిస్తున్నారు. అంతా సవ్యంగా జరిగింది అనుకునేలోపు ఒక్కసారిగా పడవ బ్యాలెన్స్ కోల్పోయి రోలర్ నదిలో పడిపోయింది.
సోషల్ మీడియాలో రోజూ అనేక వీడియోలో వైరల్ అవుతూ ఉంటాయి. వాటిలో కొన్ని ఆలోచింపచేస్తే, కొన్ని ఆందోళన కలిగిస్తాయి. మరికొన్ని స్పూర్తిని నింపుతాయి. తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఇందులో కొందరు వ్యక్తులు ఓ స్టీమ్ రోలర్‌ను పడవలోకి ఎక్కిస్తున్నారు. అంతా సవ్యంగా జరిగింది అనుకునేలోపు ఒక్కసారిగా పడవ బ్యాలెన్స్ కోల్పోయి రోలర్ నదిలో పడిపోయింది. అది ఓ వ్యక్తిమీద పడినట్టు తెలుస్తోంది. ఆ వ్యక్తి పరిస్థితి ఏంటి అనేది తెలియరాలేదు కానీ ఈ వీడియో మాత్రం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ స్టీమ్ రోలర్‌ను కొందరు వ్యక్తలు ఒడ్డు నుంచి రెండు చెక్కల సాయంతో పడవలోకి ఎక్కిస్తున్నారు. రోలర్‌పై ఉన్న వ్యక్తి దానిని ఆపరేట్ చేస్తున్నాడు. రోలర్ దాదాపు పడవలోకి ఎక్కేసింది అనుకునేసరికి పడవ ఒక్కసారిగా ఊగిపోయింది. ఈ క్రమంలో రోలర్‌ను పూర్తిగా ఎక్కించేందుకు చేసే ప్రయత్నాలు ఫలించకపోవడంతో రోలర్‌పై ఉన్న వ్యక్తి నీటిలోకి దూకేశాడు. ఆ వెంటనే రోలర్ కూడా నీటిలో పడిపోయింది. అయితే, ఇది ఎక్కడ జరిగిందన్నది తెలియరాలేదు. టెక్ దిగ్గజం ఆనంద్ మహీంద్రా తన ట్విట్టర్ ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. ఇది చూసిన నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నీటిలోకి దూకిన వ్యక్తిపైనే రోలర్ పడడంతో అతడి గురించి నెటిజన్లు ఆరా తీస్తున్నారు. ఈ వీడియోను షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా.. ఇది బహుశా ఇండియాలోనే జరిగి ఉంటుందని పేర్కొన్నారు. జీవితం అనంతమైన అవకాశాలతో నిండి ఉందని మనం నమ్ముతామని.. అదే మనకు ఉన్న ఏకైక రక్షణ అంటూ పరోక్షంగా ఇలాంటి సాహసాలు చేయొద్దని చెప్పకనే చెప్పారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..