Viral Video: పాపం.. నడిరోడ్డు మీద గుండెలు పిండేసే ఘటన… వాడు నరకంలో కుళ్లిపోవాలి అంటూ నెటిజన్స్‌ ఫైర్‌

హర్యానాలోని ఫరీదాబాద్‌లో జరిగిన ఒక దిగ్భ్రాంతికరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. జంతు హింసకు సంబంధించిన వీడియో నెటిజన్స్‌ను తీవ్రంగా కలిచివేసింది. ఈ సంఘటనను ప్రత్యక్ష సాక్షి ఒకరు కెమెరాలో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఫరీదాబాద్‌లోని రద్దీగా ఉండే రోడ్డులో...

Viral Video: పాపం.. నడిరోడ్డు మీద గుండెలు పిండేసే ఘటన... వాడు నరకంలో కుళ్లిపోవాలి అంటూ నెటిజన్స్‌ ఫైర్‌
Dog Chases Owner's Car

Updated on: Jul 07, 2025 | 11:44 AM

హర్యానాలోని ఫరీదాబాద్‌లో జరిగిన ఒక దిగ్భ్రాంతికరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. జంతు హింసకు సంబంధించిన వీడియో నెటిజన్స్‌ను తీవ్రంగా కలిచివేసింది. ఈ సంఘటనను ప్రత్యక్ష సాక్షి ఒకరు కెమెరాలో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఫరీదాబాద్‌లోని రద్దీగా ఉండే రోడ్డులో పెంపుడు కుక్కను వదిలేశాడు ఓ యజమాని. ఆ తర్వాత బాధతో ఉన్న పెంపుడు కుక్క తన యజమాని కారును వెంబడిస్తున్నట్లు ఉన్న హృదయ విదారకమైన దృశ్యం వీడియోలో కనిపిస్తుంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ సంఘటన మధ్యాహ్నం 12:30 గంటల ప్రాంతంలో QRG హాస్పిటల్ సమీపంలో జరిగిందని సోషల్ మీడియా యూజర్ పోస్ట్‌లో పేర్కొన్నారు. బూడిద రంగు కారు వెనుక కుక్క పరిగెడుతూ ఉంది. కుక్కను వదిలేసిన తర్వాత కారును పట్టుకోవడానికి ప్రయత్నిస్తుందని ఇది చూపిస్తుంది. కారు రిజిస్ట్రేషన్ నంబర్ HR51 CF 2308 గా కనిపిస్తుంది.

వీడియోను రికార్డ్ చేస్తున్న మహిళ వీడియోలో ఆ కుక్క 2 కి.మీ.లకు పైగా కారును వెంబడిస్తున్నట్లు చెబుతోంది. అయితే, కారు డ్రైవర్ కారును ఆపడం లేదు. రోడ్డు మీద పరిగెడుతున్నప్పుడు కుక్క మొరుగుతోందని, క్రూరమైన యజమాని ఆపకుండా కారులో అలాగే వెళ్లిపోయాడని ఆమె పేర్కొంది. ఇంటర్నెట్ వినియోగదారులు ఈ చర్యను ఖండిస్తున్నారు. క్రూరమై చర్యగా అభివర్ణిస్తున్నారు. కుక్కను రోడ్డు మీద వదిలి వెళ్ళిన యజమానిపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. కుక్కను వాహనాలు ఢీకొడితే ఎవరిది బాధ్యత అంటూ జంతు ప్రేమికులు మండిపడుతున్నారు.

“మానవత్వం చచ్చిపోయింది!!” కుక్కను వదిలేసినందుకు పెంపుడు కుక్క యజమానిని “వీళ్ళు నరకంలో కుళ్ళిపోవాలి” అని మరికొందరు నెటిజన్స్‌ శాపనార్థాలు పెడుతున్నారు. నేరస్థుడిని గుర్తించి, కుక్కను రక్షించడంలో సహాయపడటానికి వీడియోను షేర్ చేయమని సోషల్ మీడియా వినియోగదారులను కూడా కోరుతున్నారు.

వీడియో చూడండి: