Viral Video: వీక్లీ ఎండ్‌ కదా అని హైఎండ్‌ రెస్టారెంట్‌కు వెళితే షాకింగ్‌ సీన్‌… వెజ్‌ సలాడ్‌లో గొంగళి పురుగు ప్రత్యక్షం

ఉద్యోగస్తులకు వారాంతం తప్పితే ఎంజాయ్‌ చేయడానికి సమయం దొరకదు. అందుకే వారంలో వచ్చే ఆ ఒక్కరోజు సెలవు కోసం కుటుంబమంతా ఎదురుచూస్తుంది. అయితే గురుగ్రామ్‌లో ఓ ఐఏఎస్‌ వ్యక్తి వారంతంలో ఓ రెస్టారెంట్‌లో ఎదురైన అనుభవం ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా...

Viral Video: వీక్లీ ఎండ్‌ కదా అని హైఎండ్‌ రెస్టారెంట్‌కు వెళితే షాకింగ్‌ సీన్‌... వెజ్‌ సలాడ్‌లో గొంగళి పురుగు ప్రత్యక్షం
Caterpillar In Salad

Updated on: Jun 10, 2025 | 5:20 PM

ఉద్యోగస్తులకు వారాంతం తప్పితే ఎంజాయ్‌ చేయడానికి సమయం దొరకదు. అందుకే వారంలో వచ్చే ఆ ఒక్కరోజు సెలవు కోసం కుటుంబమంతా ఎదురుచూస్తుంది. అయితే గురుగ్రామ్‌లో ఓ ఐఏఎస్‌ వ్యక్తి వారంతంలో ఓ రెస్టారెంట్‌లో ఎదురైన అనుభవం ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మిచెలిన్-స్టార్ చెఫ్ సువీర్ శరణ్‌ యాజమాన్యంలో నడుస్తున్న ప్రసిద్ధ గురుగ్రామ్ రెస్టారెంట్ ది హౌస్ ఆఫ్ సెలెస్టేలో ఫుడ్‌ ఎంజాయ్‌ చేయడానికి ఆ ఐఏఎస్‌ జంట వెళ్లింది. ఇంతలో వారు ఆర్డర్‌ చేసిన కూరగాయల సలాడ్‌లో ఓ వింత ఆకారం కనిపించడంతో వారు అవాక్కయ్యారు.

కూరగాయల సలాడ్‌లో చనిపోయిన గొంగళి పురుగు కూడా కనపించడంతో ఒక్కసారిగా షాక్‌ తిన్నారు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. వైరల్ వీడియోలో డైనర్ బఠానీలు మరియు బ్రోకలీ సలాడ్ నుండి గొంగళి పురుగును బయటకు తీస్తున్నట్లు చూపిస్తుంది. చాలా అసహ్యంతో, ఆ మహిళ, “ఏదైనా హై-ఎండ్ ప్రదేశానికి వెళ్లండి, ₹100 విలువైన దాని ధర ₹600” అని చెప్పడం వినిపించింది, ధర మరియు పరిశుభ్రత మధ్య వ్యత్యాసం ఇలా ఏడ్చింది అంటూ స్పష్టంగా నిరాశ చెందుతూ కనిపించింది.

 

వీడియో చూడండి:

 

 

ఈ సంఘటన సెక్టార్ 15 ఫేజ్ 2 ప్రాంతంలో జరిగింది. వీడియో వైరల్‌ కావడంతో ఆహార భద్రతా అధికారుల దృష్టికి వెళ్లింది. అధికారులు రెస్టారెంట్‌లో తనిఖీలు చేపట్టారు. ఆహార నమూనాలను పరీక్ష కోసం కర్నాల్‌లోని ల్యాబ్‌కు పంపారు. ల్యాబ్‌రి పోర్టులో సంచలన విషయాలు వెల్లడించారు. రెస్టారెంట్‌ పరిశుభ్రత లోపాలు ఉన్నట్లు పేర్కొన్నారు. అనంతరం రెస్టారెంట్‌కు అధికారులు నోటీసులు జారీ చేశారు.

సువీర్ శరణ్ 2020లో రెస్టారెంట్‌ను ప్రారంభించారు. సంఘటన జరిగిన సమయంలో సంస్థ నుంచి అతడు దూరం జరిగినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఈ సంఘటనపై ఆయన ఎలాంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం.