Viral Video: అందాలను చూస్తూ ఆదమరిస్తే అట్లుంటది యవ్వారం… కొద్దిగయితే బిర్యానిని నాకి పడేస్తుండెగా..!

సోషల్‌ మీడియాను ఎక్కువగా ఫాలో అయ్యేవారికి 'ది ఆస్సీ భాయ్' గురించి పరిచయం చేయనక్కరలేదు. ఎందుకంటే ఇన్‌స్టాగ్రామ్‌లో తనను తాను 'ది ఆస్సీ భాయ్' అని పిలుచుకునే ఆస్ట్రేలియన్ ఇన్‌ఫ్లుయెన్సర్‌. సొంత దేశం ఆస్ట్రేలియాలో కంటే భారత్‌లోనే మనోడు ఎక్కువ ఫేమస్‌. తాజాగా అతను పోస్టు చేసిన వీడియో...

Viral Video: అందాలను చూస్తూ ఆదమరిస్తే అట్లుంటది యవ్వారం... కొద్దిగయితే బిర్యానిని నాకి పడేస్తుండెగా..!
Cow Smell Biryani

Updated on: Jun 09, 2025 | 7:10 PM

సోషల్‌ మీడియాను ఎక్కువగా ఫాలో అయ్యేవారికి ‘ది ఆస్సీ భాయ్’ గురించి పరిచయం చేయనక్కరలేదు. ఎందుకంటే ఇన్‌స్టాగ్రామ్‌లో తనను తాను ‘ది ఆస్సీ భాయ్’ అని పిలుచుకునే ఆస్ట్రేలియన్ ఇన్‌ఫ్లుయెన్సర్‌. సొంత దేశం ఆస్ట్రేలియాలో కంటే భారత్‌లోనే మనోడు ఎక్కువ ఫేమస్‌. తాజాగా అతను పోస్టు చేసిన వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. ఆకలితో ఉన్న స్థానికుడి నుండి ఊహించని షాక్‌కు గురయిన హాస్యాస్పద సంఘటన ఇది. అయితే ఆ స్థానికుడు వ్యక్తయితే కాదు మరి.

ప్రస్తుతం భారతదేశంలో నివసిస్తున్న ఆస్ట్రేలియన్ కంటెంట్ సృష్టికర్త గోవాలో ప్రశాంతమైన బీచ్ డేని ఆస్వాదిస్తున్నట్లు వీడియోలో కనిపిస్తుంటుంది. సూర్యుడు ప్రకాశిస్తూ, చేతిలో ఒక గిన్నెలో బిర్యానీతో కనిపిస్తాడు. సముద్రం ఒడ్డున ఉన్న ఒక గుడిసెలో చల్లగా, అతను సరైన బీచ్ సెలవులను గడుపుతున్నట్లు అనిపించింది. ఈ క్రమంలో ఒక ఆశ్చర్యకరమైన అతిథి వచ్చి పలకరిస్తుంది.

అతను కాళ్ళు చాచి, తన ఒడిలో భోజనం పెట్టుకుని కూర్చున్నప్పుడు ఆసక్తికరంగా ఒక ఆవు తన దగ్గరికి వస్తుంది. తన ఆహారాన్ని పరిశీలించడానికి ప్రయత్నించింది. బిర్యాని గిన్నె మీదికి వంగి వాసన చూసింది. అనంతరం రుచి చూడడానికి ప్రయత్నించింది. ఇంతలో ఆస్సీ భాయ్ త్వరగా తన ప్లేట్‌ను వెనక్కి తీసుకున్నాడు. అతని ఆహారం గోవుకు బీచ్ ట్రీట్‌గా మారకుండా కాపాడుకున్నాడు.

అయితే ఇక్కడ వచ్చింది ఒక్క అవే కాదు.. మరొకొన్ని ఆవులు కూడా వెనుక నిలబడి కనిపించాయి. ఆవులు ఆహారం తనిఖీ చేసిన తర్వాత ప్రశాంతంగా ముందుకు కదిలాయి. ఈ వీడియోపై నెటిజన్స్‌ ఫన్నీ కామెంట్స్‌ పెడుతున్నారు. “బ్రదర్ తన స్నేహితులను కూడా తీసుకువచ్చాడు, అతను తన స్నేహితుల ముందు ఇబ్బంది పడ్డాడు” అంటూ నెటిజన్స్‌ సరదాగా కామెంట్స్‌ రాస్తున్నారు.

 

వీడియో చూడండి: