Viral Video: గుడ్ల కోసం గూట్లోకి దూరిన పాము.. పట్టపగలే చుక్కలు చూపించిన పిట్టలు.. షాకింగ్ వీడియో..

|

Feb 05, 2022 | 3:44 PM

Viral Video: ఏ తల్లి(Mother) అయినా తన పిల్లలకు ప్రమాదం వస్తే.. ఏమాత్రం ఆలోచించదు. ఎదుట ఉన్నది ఎంత పెద్ద ప్రమాదమైనా.. ఎదురొడ్డి నిల్చుని తన ప్రాణాలను పణంగా..

Viral Video: గుడ్ల కోసం గూట్లోకి దూరిన పాము.. పట్టపగలే చుక్కలు చూపించిన పిట్టలు.. షాకింగ్ వీడియో..
Follow us on

Viral Video: ఏ తల్లి(Mother) అయినా తన పిల్లలకు ప్రమాదం వస్తే.. ఏమాత్రం ఆలోచించదు. ఎదుట ఉన్నది ఎంత పెద్ద ప్రమాదమైనా.. ఎదురొడ్డి నిల్చుని తన ప్రాణాలను పణంగా పెట్టి మరీ బిడ్డలను రక్షించుకుంటుంది. తల్లి ప్రేమ(Mother Love) అంత గొప్పది మరి. అయితే, ఈ తల్లి ప్రేమ మనుషుల్లోనే కాదు.. సమస్త జీవరాశికి వర్తిస్తుంది. చిన్న కీటకాలు సైతం తమ పిల్లలకు ఎలాంటి హానీ జరుగకుండా రక్షణగా నిలుస్తాయి. తాజాగా అలాంటి తల్లి ప్రేమకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్(Viral Video) అవుతోంది.

సహజంగానే పాములు చిన్న చిన్న కీటకాలను, పక్షులను గుడ్లను ఆహారంగా తింటాయి. ఈ వీడియో కూడా ఓ భారీ పాము.. చెట్టుకు ఉన్న గూట్లో పక్షి గుడ్లను తినేందుకు ప్రయత్నింది. ఆ క్రమంలో గూట్లోకి చొరబడింది పాము. అయితే, పామును గమనించిన తల్లి పక్షి.. గుడ్లకు ప్రమాదం జరుగకుండా పాముతో తీవ్రంగా పోరాడింది. ఆ పాము గుడ్లను తినకుండా ఉండేందుకై దానితో కొట్లాడింది. పామును తన పదునైన ముక్కుతో పొడిచి పొడిచి చుక్కలు చూపింది. పక్షి దాడికి తట్టుకోలేకపోయిన పాము.. మొదటి భయపట్టే ప్రయత్నించింది. అయినప్పటికీ ఆ పక్షి వెనక్కి తగ్గకపోవడంతో బయంతో తోక ముడిచింది. అక్కడి బతుకు జీవుడా అంటూ పరుగు లంకించుకుంది. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రమ్‌లో ‘nature27_12’ పేరుతో ఉన్న యూజర్.. షేర్ చేశారు. ఈ బ్యూటీఫుల్ వీడియోను చూసిన నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. ఈ వీడియోను వేలాది మంది వీక్షించగా.. 2,300 లకు పైగా లైక్స్ వచ్చాయి.

Viral Video:

Also read:

Banking News: ఆ బ్యాంకు ఖాతాదారులకు షాక్‌.. వడ్డీ రేట్లు తగ్గింపు

PM Modi Hyderabad Tour: హైదరాబాద్ లో ప్రధాని నరేంద్ర మోదీ.. లైవ్ లో చూడండి

CBSE Term 2 Exams 2022: టర్మ్ 2 పరీక్షలకు శాంపిల్ ప్రాక్టీస్ పేపర్లను విడుదల చేసిన సీబీఎస్సీ! ఎలా డౌన్‌లోడ్ చేయాలంటే..