VIRAL VIDEO : చిన్నారి వెయిట్ లిఫ్టర్..! అచ్చం ఒలంపిక్ విన్నర్ మీరాబాయిని దించేసింది..

|

Jul 27, 2021 | 12:40 PM

VIRAL VIDEO : టోక్యో ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన భారత మహిళా వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను దేశవ్యాప్తంగా

VIRAL VIDEO : చిన్నారి వెయిట్ లిఫ్టర్..! అచ్చం ఒలంపిక్ విన్నర్ మీరాబాయిని దించేసింది..
Little
Follow us on

VIRAL VIDEO : టోక్యో ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన భారత మహిళా వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను దేశవ్యాప్తంగా ప్రజలకు స్ఫూర్తిగా నిలిచింది. తన కలను నెరవేర్చుకుంది. జూలై 24 న 49 కిలోల వెయిట్ లిఫ్టింగ్‌లో రజత పతకం సాధించి భారత ఖ్యాతిని ప్రపంచ దేశాలలో చాటింది. ఈ ఏడాది టోక్యో ఒలింపిక్స్‌లో పతకం సాధించిన తొలి భారత అథ్లెట్‌గా చాను నిలిచింది. అలాంటిదే ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ వీడియోలో ఒక చిన్నారి మీరాబాయి చానును అనుకరిస్తుండటం విశేషం. ఆ అమ్మాయి వెయిట్ లిఫ్టింగ్ చేస్తున్నట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఆమె వెనుకాల టీవీలో మీరాబాయి చాను ఒలింపిక్స్‌లో పతకం సాధించడం చూడవచ్చు. అసలైన వీడియోలో ఆ దృశ్యం చూసిన వెయిట్ లిఫ్టర్ సతీష్ కుమార్తె అచ్చం మీరాబాయి చాను చేసినట్లుగా బరువు ఎత్తతుంది. దీంతో ఈ వీడియోపై మీరాబాయి చాను సంతోషం వ్యక్తం చేశారు. చిన్నారిని అభినందించారు. ఈ వీడియోను వెయిట్ లిఫ్టర్ సతీష్ శివలింగం ట్విట్టర్‌లో షేర్ చేశారు.

అంతేకాకుండా జూనియర్ @ మిరాబాయి_చానును అని కామెంట్ రాశాడు. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిన వెంటనే ప్రజలు తమ స్పందనను తెలియజేయడం ప్రారంభించారు. మీరాబాయి చాను నిజంగా మన దేశానికి గర్వకారణమని ఒక నెటిజన్ అన్నారు. మరొకరు ఈ చిన్న అమ్మాయి మీరాబాయి చాను కావాలని కలలు కనడం ప్రశంసనీయమన్నారు. అంతేకాకుండా చాలామంది మీరాబాయి నైపుణ్యాలను వివిధ మార్గాల్లో మెచ్చుకున్నారు. ఇప్పటివరకు 2 లక్షల మందికి పైగా ఈ వీడియోను ట్విట్టర్‌లో చూశారు. ఈ వీడియోను 21 వేల కంటే ఎక్కువ సార్లు లైక్ చేశారు.

VIRAL VIDEO : ఘోరమైన యాక్సిడెంట్..! బైక్‌ని ఢీ కొట్టి.. కారు డ్రైవర్ ఎలా ఎస్కేప్ అవుతున్నాడో చూడండి..

అస్సాం-మిజోరం సరిహద్దుల్లో ఏం జరిగింది ? హోమ్ మంత్రి విద్వేష బీజాలు నాటుతున్నారన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ

Global Warming: ఏసీల వాడకం వల్ల పెరిగిపోతున్న గ్లోబల్ వార్మింగ్..ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని ఏసీలు ఉన్నాయో తెలుసా?