Viral Video: ఈ ఆటోను చూస్తే ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే… ఇన్ని ఇకమతులు ఎలా రా బాబు?
సృజనాత్మకత ఉండాలే గానీ పనికి రాని వస్తువులకు ప్రాణం పొయోచ్చు. మహారాష్ట్రలోని అమరావతిలోని ఓ ఆటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఎందుకంటే దాన్ని అటో అనేదానికంటే లగ్జరీ కారు అంటేనే బెటర్. ఓ సాధారణ ఆటోను కళాత్మకంగా మోడిఫై చేసిన తీరు అందరి ప్రశంసలు...

సృజనాత్మకత ఉండాలే గానీ పనికి రాని వస్తువులకు ప్రాణం పొయోచ్చు. మహారాష్ట్రలోని అమరావతిలోని ఓ ఆటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఎందుకంటే దాన్ని అటో అనేదానికంటే లగ్జరీ కారు అంటేనే బెటర్. ఓ సాధారణ ఆటోను కళాత్మకంగా మోడిఫై చేసిన తీరు అందరి ప్రశంసలు అందుకుంటుంది.
అమరావతి జిల్లాలోని బద్నేరాకు చెందిన ఒక ఆటో డ్రైవర్ తన సాధారణ త్రీ వీలర్‌ను చాలామంది “లగ్జరీ ఆటో”గా మార్చిన తర్వాత నెట్టింట సంచలనంగా మారాడు. తన మోడిఫైడ్ వాహనంక వైరల్ వీడియో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది.ఊహించని ప్రదేశాల నుంచి కూడా ఆవిష్కరణల రాగలవని రుజువు చేసింది.
ప్రీమియం కార్లలో మాత్రమే సాధారణంగా కనిపించే సౌకర్యాలను జోడించి, డ్రైవర్ తన ఆటో-రిక్షాను పూర్తిగా మార్చేశాడు. వాహనంలో ఎయిర్ కండిషనింగ్, పవర్ విండోస్, కన్వర్టిబుల్ సీటింగ్, ఆధునిక ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉన్నాయి. దీనికి తోడు ఆటోలో నాలుగు డోర్లు ఉన్నాయి. రయాణీకులకు సులభంగా ఉండటంతో పాటు సొగసైన కారు లాంటి రూపం సంతరించుకుంది.
లోపల వెనుక సీటును సౌకర్యవంతమైన బెడ్‌గా మడవవచ్చు. ఇది వాహనాన్ని సుదీర్ఘ ప్రయాణాలకు లేదా విశ్రాంతి విరామాలకు అనువైనదిగా చేస్తుంది. వెనుక భాగంలో ఉన్న విశాలమైన బూట్ కంపార్ట్‌మెంట్ లగేజ్ కోసం సెట్ చేశారు. ఇది సాంప్రదాయ ఆటోలకు భిన్నంగా ఉంది.
వీడియో చూడండి:
View this post on Instagram
ఇన్‌స్టాగ్రామ్‌లో మొదట యూజర్ సమీర్ షేక్ (@uff_sam) షేర్ చేసిన క్లిప్ వైరల్ అవుతోంది. నెటిజన్స్ ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు. ఒక వ్యక్తి “ఎలోన్ మస్క్, దయచేసి ఈ మేధావిని చూడండి” అని రాశాడు, మరొకరు “మీరు దీన్ని ఓయో గదిగా మార్చాలని ప్లాన్ చేస్తున్నారా?” అని చమత్కరించారు.
చాలా మంది కస్టమ్-బిల్ట్ వాహనాన్ని మహీంద్రా థార్, రేంజ్ రోవర్ మరియు టయోటా ఫార్చ్యూనర్ వంటి లగ్జరీ కార్లతో పోల్చారు. “ఇది లోపలి నుండి ఆటో లాగా కూడా కనిపించదు” అని ఒక వినియోగదారు వ్యాఖ్యానించగా, మరొకరు “నిజాయితీగా చెప్పాలంటే థార్ కంటే మంచిది” అని వ్యాఖ్యానించారు.
