భారత క్రికెట్ మ్యాచ్ అంటే కోట్లాదిమంది క్రికెట్ ప్రేమికులు, ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తుంటారు. కోట్లాది క్రికెట్ ప్రేమికుల ఆశను నిరాశ చేస్తూ.. T20 ప్రపంచ కప్ సెమీ-ఫైనల్ లో భారత్ క్రికెట్ జట్టు ఘోర పరాజయం పాలైంది. మన దేశం ఓటమి పాలవడం మిలియన్ల మంది అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. హృదయ విదారకంగా విలపించిన క్రికెట్ ప్రేమికులు కూడా ఉన్నారంటే అతిశయోక్తికాదు. ఓటమితో నిరాశావాదంలోకి కూరుకుపోయిన ఫ్యాన్స్ తమ ఫీలింగ్స్ ను వ్యక్తం చేయడానికి సోషల్ మీడియాను ఎంచుకున్నారు. అలాంటి వారిలో పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ఒకరు. మనదేశం ఓడిపోవడం బాధించే విషయం కాదు.. అయితే ఓడిపోయిన విధానం బాధిస్తుందని పేర్కొన్నారు.
అయితే ఇలా తాను ట్వీట్ చేసిన వెంటనే తనకు ఓదార్పు దొరికిందని చెప్పారు ఆనంద్ మహీంద్రా. ఈ వీడియోను ఒక స్నేహితుడు తనకు పంపినట్లు పేర్కొన్నారు. ఈ వీడియో న్యూయార్క్‌లోని ఒక క్యాబ్ డ్రైవర్ మాట్లాడుతున్నాడు. ఆ డ్రైవర్ మన దేశం ఒక బ్రాండ్ లా ఎలా రూపాంతరం చెందుతుంది.. రోజు రోజుకీ భారత దేశం ఒక బ్రాండ్ గా మారి ప్రపంచ వ్యాప్తంగా ఎలా విస్తరిస్తుందో చెప్పాడు. ప్రపంచాన్ని నడుపుతున్న భారతీయులందరికీ” అంటూ ఆ డ్రైవర్ భారతీయులు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ప్రపంచవ్యాప్తంగా కార్యనిర్వాహక, రాజకీయ పదవులను ఆక్రమిస్తున్న భారతీయుల గురించి స్పష్టమైన సూచన చేశారు. ఇది తనకు (టీ20 ప్రపంచకప్‌ను ‘రూల్’ చేయక పోయినా ఈ వీడియో తనకు కొంత ఓదార్పునిచ్చిందని ఆనంద్ మహీంద్రా వీడియోకి క్యాప్షన్ జత చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో ఓ రేంజ్ లో చక్కర్లు కొడుతోంది.
న్యూయార్క్‌లోని ఒక క్యాబ్ డ్రైవర్ మాటల్లో భారత్ గొప్పదనం:
An Indian friend of mine had this chance encounter with a cabbie in New York. Fascinating how the brand of a country gets transformed and amplified. And cab drivers everywhere are great references of brand values! (Some consolation for not ‘ruling’ the T20 World Cup! ?) pic.twitter.com/4mmxeZSz1S
— anand mahindra (@anandmahindra) November 10, 2022
ఇంగ్లండ్ నిర్ధేశించిన స్కోర్ ను భారత్ ఛేదించడంలో ఆది నుంచి తడబడుతూనే ఉంది. ఇంగ్లండ్ అన్ని విభాగాల్లో భారత్ కంటే మెరుగైన ప్రదర్శన కనబరిచిందని కోచ్ రాహుల్ ద్రవిడ్ మ్యాచ్ అనంతరం విలేకరుల సమావేశంలో తెలిపారు. సెమీ ఫైనల్ లో భారత్ గెలవకపోయినా ఈ టోర్నీలో భారత్ జట్టు అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చిందని.. ఐదు మ్యాచ్‌లలో నాలుగు గెలిచి గ్రూప్ 2లో అగ్రస్థానంలో నిలిచిందని ద్రావిడ్ చెప్పారు. టీ20 ప్రపంచకప్ టైటిల్ కోసం ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్థాన్‌తో ఇంగ్లాడ్ తలపడనుంది.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..