Viral Video: భారత్‌‌లో స్థిరపడిన అమెరికా మహిళ.. మన దేశం ఎందుకు గొప్పదో 3 ముక్కల్లో చెప్పేసింది..

|

Sep 28, 2024 | 7:08 PM

140 కోట్ల జనాభాతో అభివృద్ధి చెందుతున్న దేశమైన భారతదేశం.. ప్రపంచంలోని అన్ని మతాల ప్రజలు శాంతియుతంగా జీవిస్తున్న ఏకైక దేశం. ప్రతి ఒక్కరూ కలలు కనే ప్రతీదాన్ని ఈ దేశం ఇస్తుంది. ప్రతి సంవత్సరం లక్షలాది మంది విదేశీ పర్యాటకులు భారతదేశాన్ని చూడడాని వస్తారు. చాలా మంది ఇక్కడే ఉండడానికి ఆసక్తిని చూపిస్తారు కూడా..అయితే అమెరికా నుంచి భారత దేశానికి వచ్చిన ఓ మహిళ గురించి ఈ రోజుల్లో చర్చనీయాంశమైంది. తన దేశం నుంచి భారతదేశాన్ని సందర్శించడానికి వచ్చింది.

Viral Video: భారత్‌‌లో స్థిరపడిన అమెరికా మహిళ.. మన దేశం ఎందుకు గొప్పదో 3 ముక్కల్లో చెప్పేసింది..
American Women Kristen Fisher
Image Credit source: Instagram
Follow us on

ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం గురించి మాట్లాడితే ముందుగా చైనా, ఇండియా పేర్లు మాత్రమే గుర్తుకు వస్తాయి. అయితే ఈ రెండు దేశాలలో మీరు ఎక్కడ స్థిరపడాలనుకుంటున్నారు అని ప్రపంచంలో ఎవరినైనా అడిగితే చాలా మంది సమాధానం భారతదేశం అని ఉంటుంది. 140 కోట్ల జనాభాతో అభివృద్ధి చెందుతున్న దేశమైన భారతదేశం.. ప్రపంచంలోని అన్ని మతాల ప్రజలు శాంతియుతంగా జీవిస్తున్న ఏకైక దేశం. ప్రతి ఒక్కరూ కలలు కనే ప్రతీదాన్ని ఈ దేశం ఇస్తుంది. ప్రతి సంవత్సరం లక్షలాది మంది విదేశీ పర్యాటకులు భారతదేశాన్ని చూడడాని వస్తారు. చాలా మంది ఇక్కడే ఉండడానికి ఆసక్తిని చూపిస్తారు కూడా..

అయితే అమెరికా నుంచి భారత దేశానికి వచ్చిన ఓ మహిళ గురించి ఈ రోజుల్లో చర్చనీయాంశమైంది. తన దేశం నుంచి భారతదేశాన్ని సందర్శించడానికి వచ్చింది. ఇక్కడకు వచ్చిన తర్వాత ఆమె కు మన దేశంలో మూడు విషయాలు అమితంగా నచ్చాయి. వాటిని చూసి ఆమె మన దేశంలోనే ఉండిపోయింది. ఆ అమెరికెన్ యువతి క్రిస్టెన్ ఫిషర్.. ఆమెకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఈ విదేశీ మహిళ అమెరికా వదిలి భారత దేశంలో స్థిరపడడానికి గల కారణాన్ని కూడా వివరించింది. ఆ కారణాలు విన్న తర్వాత ఎవరైనా సరే భారత దేశంలో జన్మించినందుకు గర్వపడతారు.

ఇవి కూడా చదవండి

ఇక్కడ వీడియో చూడండి

అమెరికాలో నివసించే చోట మనుషుల మధ్య సోషల్ కనెక్టివిటీ ఉండదని.. అంటే నివసించే చోట ఒకరితో ఒకరికి సంబంధం లేకుండా జీవిస్తారు. అక్కడ కమ్యూనిటీ ఉన్న మాట వాస్తవమే అయితే రీల్ లైఫ్‌లో లా కమ్యునిటీ రియల్ లైఫ్‌లో లోపించిందని క్రిస్టెన్ ఫిషర్ చెప్పింది. అయితే ఇందుకు విరుద్ధంగా భారతదేశంలో ప్రతి ఒక్కరూ ఒకరికొకరుగా కలిసి మెలసి ఉంటారని చెప్పింది. అంతేకాదు భారతదేశంలోని సంస్కృతి, జీవన విధానం చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది డబ్బు కంటే విలువైనదని చెప్పింది. తాను అమెరికాలో ఇప్పటివరకు గడిపిన జీవితం సంతృప్తికరంగా లేదని.. జీవితంలో జీవించడం అనేది అక్కడ చాలా తక్కువ అని చెప్పింది. క్రిస్టెన్ ఫిషర్ చెప్పిన మూడో విషయం ఏమిటంటే.. భారత దేశం లాంటి దేశం ఈ ప్రపంచంలోనే మరొకటి లేదని క్రిస్టెన్ ఫిషర్ తన వీడియోలో పేర్కొంది.

ఈ వీడియో వైరల్ అయిన తర్వాత ప్రజలు దీన్ని చూడటమే కాదు ఒకరితో ఒకరు పంచుకుంటున్నారు. భారత్ పై ప్రేమలో మునిగితేలుతున్న ఈ విదేశీ యువతి పోస్ట్ పై యూజర్లు కామెంట్స్ చేస్తున్నారు. భారతదేశానికి వచ్చిన తర్వాత తాను వేరే దేశానికి వచ్చినట్లు అనిపించడం లేదని ఓ విదేశీయుడు తన అనుభవాన్ని పంచుకున్నాడు. మరొకరు భారత దేశంలో మీరు ఎప్పటికీ ఒంటరిగా భావించరు అని కామెంట్ చేశారు. క్రిస్టెన్ 2017 నుంచి న్యూఢిల్లీలో నివసిస్తోంది.

 

మరిన్ని టెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..