Viral Video: ల్యాండ్ అయిన విమానానికి అంటుకున్న మంటలు.. ప్రయాణికులంతా సేఫ్.. షాకింగ్ వీడియో మీకోసం..!

|

Jun 23, 2022 | 10:37 PM

Viral Video: విమానాశ్రయంలో ల్యాండ్ అయిన విమానానికి ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. రన్‌వే పై ల్యాండింగ్ గేర్ కూలిపోవడంతో

Viral Video: ల్యాండ్ అయిన విమానానికి అంటుకున్న మంటలు.. ప్రయాణికులంతా సేఫ్.. షాకింగ్ వీడియో మీకోసం..!
Airplane
Follow us on

Viral Video: విమానాశ్రయంలో ల్యాండ్ అయిన విమానానికి ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. రన్‌వే పై ల్యాండింగ్ గేర్ కూలిపోవడంతో విమానం మంటల్లో చిక్కుతుంది. వెంటనే అలర్ట్ అయిన ఎయిర్‌పోర్ట్ సిబ్బంది.. ప్రయాణికులను అత్యవసర డోర్ నుంచి కిందకు దించారు. ఈ ఘటనలో ముగ్గురు ప్రయాణికులు గాయపడ్డారు. అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం.. డొమినికన్ రిపబ్లిక్‌లోని శాంటో డొమింగో నుంచి మియామి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు రెడ్ ఎయిర్ ఫ్లైట్ వచ్చింది.

అయితే, ఫ్లైట్ ల్యాండింగ్ సమయంలో సాంకేతిక లోపం ఏర్పడటంతో ఒక్కసారిగా విమానం కూలిపోయింది. వెనుక భాగంలో మంటలు అంటుకున్నాయి. 126 మంది ప్రయాణిస్తున్న ఈ విమానం మంటల్లో చిక్కుకుపోవడంతో.. ఎయిర్ పోర్టు సిబ్బంది అలర్ట్ అయ్యింది. వెంటనే ఫైర్ ఇంజిన్స్, రెస్క్యూ టీమ్.. విమానం వద్దకు చేరుకున్నారు. విమానానికి అంటుకున్న మంటలను చల్లార్చారు. విమానంలోని ప్రయాణికులను క్షేమంగా కిందకు దించారు. అయితే, ఇందులో ముగ్గురు ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. కాగా, రన్‌వే పై క్రాష్ అయిన విమానం.. క్రేన్ టవర్, ఓ చిన్న భవనంతో సహా అనేక వస్తువులను ఢీకొన్నట్లు తెలుస్తోంది.