Madhya Pradesh: దేశమంతటా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో తేళ్లు, విషసర్పాలు తదితర జంతువులు జనావాసాల్లోకి వచ్చేస్తున్నాయి. ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఈక్రమంలో భారీ వర్షాలకు మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఒక కాలనీలోకి మొసలి వచ్చింది. దీంతో స్థానికులు బెంబేలెత్తిపోయారు. శివపురి జిల్లాలో శనివారం రాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. ఇళ్లన్నీ వరద నీటితో నిండిపోయాయి. ఈక్రమంలో శివపురి పాత బస్టాండ్ సమీపంలోని కాలనీ కూడా నీట మునిగింది. అయితే భారీ వరద నీరు కారణంగా అక్కడికి ఆదివారం ఒక మొసలి వచ్చింది. దీంతో స్థానికులు భయపడిపోయారు. వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు.
Crocodile in shivpuri m.p pic.twitter.com/D2kVvDmlAH
ఇవి కూడా చదవండి— Pankaj Arora (@Pankajtumhara) August 14, 2022
కాగా పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మాధవ్ నేషన్‌ల్ పార్క్ నుంచి రెస్క్యూ టీంని రంగంలోకి దింపి గంటపాటు శ్రమించి ఆ మొసలిని బంధించారు. సుమారు ఎనిమిది అడుగుల పొడవున్న ఆ మొసలిని సాంఖ్యసాగర్ సరస్సులో విడిచిపెట్టారు. అయితే కొన్ని గంటల పాటు వరద నీటిలో తచ్చాడుతున్న మొసలిని కొందరు తమ సెల్‌ఫోన్లతో ఫొటోలు, వీడియోలు చిత్రీకరించారు. అనంతరం వాటిని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్‌గా మారాయి.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..